పుష్కర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
పుష్కర్ అతి పురాతన నగరము. దీని నిర్మాణము జరిగిన సమయలు లెక్కకట్ట్డానికి వీలుకానిది. బ్రహ్మదేవుడు ఈ నగర నిర్మాణనికి కారణమయ్యాడని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ [[బ్రహ్మ]]దేవుడు రాధా క్రిష్ణులను ప్రత్యక్షం చేసుకోవడానికి 60,000 సంవత్సరాలు యజ్ఞం చేసాడని పురాణాల కధనాలు చెప్తున్నాయి.
బ్రహ్మదేవుడు యజ్ఞము చేయ తలపెట్టి తగిన ప్రదేశము వెదుకుతున్న సమయంలో ఈ ప్రదేశము యజ్ఞానికి అనువైనదిదిగా భావించబడినదని పురాణాలు చెప్తున్నాయి.
 
ప్రస్తుతం ఇక్కడున్న దేవాలయం 14వ శతాబ్ధంలో కట్టిందని, కాని దానికి పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితంమే అక్కడ ఆలయం వుండేదని అంటారు. తర్వాత [[ఆదిశంకరాచార్యుడు]] ఒకసారి, మహారాజ జనత్ రాజు మరోసారి ఆలయాన్ని పునరుద్దరించారని చరిత్రకారుల నమ్మకం. ఆలయంలోని గోడలకు వెండి నాణేలు అంటించి వున్నాయి. భక్తులు తమపేరు చెక్కిన వెండి నాణేలను దేవునికి సమర్పిస్తుంటారు. పాలరాతి మెట్లు ఎక్కి మండపం దాటి గర్బగుడిలోకి వెళ్లగానే హంసవాహనం మీద వున్న చతుర్ముఖ [[బ్రహ్మ]]విగ్రహం కనిపిస్తుంది. ఆయన నాలుగు చేతుల్లో వరుసగా అక్షమాల, కమండలం, పుస్తకం, దర్భలు ఉంటాయి. ఆలయ గోడల మీద [[సరస్వతి]]దేవి, ఇతర దేవీ దేవతల బొమ్మలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆలయంలొ పూజాదికాలు సనాతనధర్మం ప్రకారమే జరుగు తుంటాయి. గర్బగుడి లోని విగ్రహాన్ని గృహస్థులైన పురుషులు పూజించ రాదు. కేవలం సన్యసించిన వారే పూజించాలి. ఆ సాధువులు కూడ పుష్కర్ లోని పరాశర గోత్రీకులు మాత్రమే అయి వుండాలనేది నిబంధన. గర్బగుడికి ఎదురుగా వున్న మండపంలో వెండితాబేలు వున్నది. ప్రతిఏటా కార్తీక పౌర్ణమితో బాటు ప్రతిపౌర్ణమి , అమావాస్య రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కార్తీక మాసంలోనె పుష్కర్ జాతర కూడ జరుగుతుంది. ఇది దీపావళి తరవాత వచ్చే ఏకాదశి నాడు మొదలై పౌర్ణమి వరకు జరుగుతుంది. జాతర సమయంలో వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ జాతర హస్తకళలకు పెట్టింది పేరు. ఆలయానికి ఎదురుగా వున్న రెండు కొండలపై వున్న [[సావిత్రి]], [[గాయత్రి]] దేవతలను కూడ భక్తులు దర్శించుకుంటారు . సావిత్రి ముఖ కవళికలు కోపంగాను, గాయిత్రి విగ్రహం భయపడు తున్నట్లు ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఇంకా అనేక దేవాలయాలున్నాయి. అందులో ముఖ్యమైనది అగస్తేశ్వర ఆలయం ఉంది. అందులోని శివలింగం బ్రహ్మ చేత ప్రతిష్టించబడిందని, ఇక్కడ పూజలు చేసి, అభిషేకం చేసిన వారికి మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. పెద్దదైన ఈ శివలింగం పై రాగితో చేసిన పాము చుట్టు కొని వున్నట్టుటుంది. శివరాత్రి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. తర్వాత మరో ఆలయం పేరు రంగ్‌జీ ఆలయం ఉంది. ఇక్కడి [[విష్ణు]]మూర్తిని రంగ్‌జీ అని పిలుస్తారు. ఈ ఆలయం దక్షిణభారతదేశ శైలిలో వుంటుంది. మరో ముఖ్య మైన ఆలయం వరాహ దేవాలయం. ఇక్కడ విష్ణుమూర్తి వరాహరూపంలో దర్శనమిస్తాడు. ఇంకా ఈ చుట్టుపక్కల అనేక దేవాలయాలున్నాయి.
* రామణంలో ఈ నగర ప్రస్థావన ఉంది. [[వశిష్టుడు]] ఇక్కడ తపసు చేసినట్లు వర్ణించబడింది.
* అరప్సరకాంత [[మేనక]] పుష్కరక్షేత్రంలో స్నానం చేసినట్లు వర్ణించబడింది.
* మహాభారత కధనం ప్రకారం ధర్మరాజు అరణ్యవాస సమయంలో [[ధర్మరాజు]]తన తమ్ములతో తీర్ధయాత్రలు చేసిన సమయంలో సింధులోయలోని అడవులవెంట ప్రయాణించి చిన్న చిన్న నదులను దాటి పుష్కర క్షేత్రంలో స్నానం ఆచరించినట్లు వర్ణించబడింది.
* వామనపురాణ కధనం [[ప్రహ్లాదుడు]] తీర్ధయాత్రలు చేసిన సమయంలో పుష్కరక్షేత్రాన్ని దర్శించినట్లు చెప్పింది.
* మాండోర్ రాజైన గుర్జర ప్రతుహార, నాహదరావ ఈ తీర్ధక్షేత్రాన్ని పునరుద్ధరించారని భావిస్తున్నారు. ఆయన ఈ ప్రదేశాన్ని శుభ్రపరచి తీరాలను నిర్మించి విశ్రాంతి మందిరాలను నిర్మించి స్నాన ఘట్టాలని నిర్మించాడు.
* రాజపుత్ర గజటర్ అనుసరించి పుష్కర్ చేచి గుర్జర్ల అధీనంలో 700 సంవత్సరాలు ఉందని భావించబడుతుంది. తరువాత కొన్ని ఆలయాలు కన్పతి జోగీల చేత ఆక్రమించబడిందని తెలుస్తుంది.
* పుష్కర్ క్షేత్రంలో భోపాస్ పేరుతో ఇక్కడ గుర్జర్ల సమూహమే పూజాధి కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
* పరాశర మహర్షి ఇక్కడ జన్మించినట్లు పురాణ కధనం. ఆయన సంతతి బ్రాహ్మణులు ఈ ప్రదేశం దాని పరసిసర ప్రాంతాలలో కనుగొనబడ్డారు. ప్రఖ్యాత '''జీన్మాతా''' ఆలయం పరాశర బ్రాహ్మణుల చేత 1,000 సంవత్సరాలుగా సంరక్షించబడుతుంది. పుష్కర బ్రాహ్మణులు ఇక్కడ స్థానికులేనని భావించబడుతుంది.
* ప్రఖ్యాత '''పుష్కర్ కెమేల్ ఫెయిర్''' ఇక్కడ నిర్వహించబడుతుంది.
* '''రాజపుతానా ఏజెన్సీ ''' కి చెందిన 3,831 మంది ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.
==== నామ చరిత్ర ====
సంస్కృతంలో పుష్కర్ అంటే నీలి తామర పుష్పము. హిందువులు దేవునిచేత పంపబడిన హంస ముక్కు నుండి కిందకు జారిన తామరపుష్పము బ్రహ్మయజ్ఞము చేసిన ప్రదేశములో ఏర్పడిన సరస్సు కనుక దానికి పుష్కర్ అనే పేరు వచ్చినదని విశ్వసిస్తున్నారు. పుష్కర్ అనే పదము పుష్కరిణి అనే పదము నుండి వచ్చిందని అంచనా. పుష్పము అంటే పువ్వు కర అంటే చేయి చేతి నుండి జారిన పువ్వు వలన ఏర్పడిన సరస్సు కనుక పుష్కర్ అయ్యిందని విశ్వసిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/పుష్కర్" నుండి వెలికితీశారు