ఉత్తరాఖండ్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము మార్పులు చేస్తున్నది: sa:उत्तराञ्चलः
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''ఉత్తరాఖండ్'''([[హిందీ]]:उत्तराखण्ड) ఉత్తర భారతదేశంలోని ఒక రాష్ట్రము. ఇది 2006 వరకు '''ఉత్తరాంచల్''' గా పిలవబడినది. ఉత్తరాఖండ్ 2000 సంవత్సరము నవంబరు 9న భారతదేశంలో 27వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇది అంతకు ముందు [[ఉత్తరప్రదేశ్]] రాష్ట్రంలో ఒక భాగము. 1990నుండి కొద్దికాలం శాంతియుతంగా సాగిన ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం విజయవంతమై ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. [[ఉత్తరప్రదేశ్]] , [[హిమాచల్ ప్రదేశ్]] లు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హద్దులు. ఉత్తరాన [[చైనా]] ([[టిబెట్]]), [[నేపాల్]] దేశాలతో సరిహద్దులున్నాయి. రాష్ట్రం యొక్క తాత్కాలిక రాజధాని [[డెహ్రాడూన్]]. ఇదే ఈ రాష్ట్రంలో అతి పెద్ద నగరం. హైకోర్టు మాత్రం [[నైనిటాల్]] లో ఉన్నది. రాష్ట్రానికి నట్టనడుమున ఉన్న [[గైర్సాయిన్]] అనే చిన్న గ్రామాన్ని ముందుముందు రాజధానిగా తీర్చిదిద్దాలనే ప్రతిపాదన ఉంది.
 
ఉత్తరాఖండ్‌లో పశ్చిమప్రాంతాన్ని [[ఘఢ్వాల్]] అనీ, తూర్పు ప్రాంతాన్ని [[కుమావూ]] అనీ అంటారు. ఉత్తరాఖండ్ ఎంతో అందమైన రాష్ట్రం. ఉత్తర ప్రాంతం హిమాలయ పర్వత సానువుల్లో హిమవాహినులతోనూ, దక్షిణ ప్రాంతం దట్టమైన అడవులతోనూ కనుల పండువుగా ఉంటుంది. ఎన్నో ప్రత్యేకమైన జీవజాలాలు (భరల్, మంచుపులి వంటివి), వృక్ష సంపత్తి ఈ ప్రాంతానికి పరిమితం. భారతదేశానికి జీవనాడులైన [[గంగా నది|గంగా]], [[యమున|యమునా]] నదులు ఉత్తరాఖండ్‌లోని హిమవాహినులలో పుడుతున్నాయి. తరువాత అవి ఎన్నో ఏరులు, సరసులు, హిమపాతాలతో కలసి మహానదులై మైదానంలో ప్రవేశిస్తున్నాయి.
"https://te.wikipedia.org/wiki/ఉత్తరాఖండ్" నుండి వెలికితీశారు