హరనాథ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''హరనాథ్''' ([[1936]] - [[1989]]) ప్రముఖ తెలుగు సినిమా నటుడు.ఈయన పూర్తి పేరు '''భూపతిరాజు హరనాద్ రాజు'''.ఈయనకి ఒక కొడుకు,కూతురూ ఉన్నారు. ఇతని అల్లుడు సినిమా నిర్మాత [[జి.వి.జి.రాజు]].పవన్ కళ్యాణ్ తొ తొలిప్రేమ చిత్రాన్ని నిర్మించింది ఇతనే. హరనాద్ కుమారుడి పేరు శ్రీనివాసరాజు. ఇదె పేరుతొ తెలుగు సినిమా హీరో ఇంకొకరున్నారు. శోభన్ బాబు నటించిన సర్పయాగం లొ నటించాడు. రోజా హీరోయిన్.హరనాద్ సోదరుడు సుబ్బరాజు కూడా సినీ నటుడే. ఇతను క్రాంతి అనె సినిమాలొ నటిస్తూ అకస్మాత్తుగా మరణించాడు.
 
హరనాథ్ 1936, సెప్టెంబర్ 2న [తూర్పు గోదావరి]] జిల్లా [[గొల్లప్రోలు]] మండలం[[రాపర్తి]]లో జన్మించాడు. ఈయన అనేక స్వల్ప వ్యయంతో నిర్మించే సినిమాలలో కథానాయకుడుగా నటించాడు. కళాశాలలో చదువుకునే రోజుల్లో హరనాథ్ అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నాడు. ఒక రోజు మద్రాసులోని పాండీ బజార్లో చెప్పులు కొనుక్కుంటుండగా దర్శకుడు [[గుత్తా రామినీడు]] హరనాథ్ ను చూసి తను తీయబోతున్న కొత్త చిత్రం మా ఇంటి మహాలక్ష్మిలో కథానాయకుడి పాత్రకోసం ఎన్నుకున్నాడు. హైదరాబాదులో నిర్మించిన తొలి తెలుగు సినిమా, [[మా ఇంటి మహాలక్ష్మి]] (1959) తో హరనాథ్ కథానాయకుడుగా తెలుగు సినిమా రంగంలో ప్రవేశించాడు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీయార్, ఏఎన్నార్ తరువాత తెలుగులో హరనాద్ ప్రముఖ హీరో అని అనిపించుకున్నాడు.<ref>http://www.cinegoer.com/titbitsarchives/janmar2006.htm</ref> [[నందమూరి తారక రామారావు]], తన సొంత సంస్థ ఎన్.ఎ.టి పతాకంపై దర్శకత్వం వహించి నిర్మించిన తొలి చిత్రం [[సీతారామకళ్యాణం]]లో కథానాయకునిగా హరనాథ్ ను ఎంచుకున్నాడు. ఆ సినిమాలో ఎన్టీయార్ రావణుని పాత్ర పోషిస్తే హరనాథ్ రాముని వేషం వేశాడు.
 
చివరి దశలో మద్యపానానికి అలవాటు పడడంతో కేవలం అతిధి పాత్రలలో నటించే అవకాశాలే వచ్చాయి. హరనాథ్ చివరి సినిమా... చిరంజీవి నటించిన, [[నాగు]] సినిమాలో తండ్రి పాత్ర పోషించాడు. ఈయన 1989 నవంబర్ 1 మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/హరనాథ్" నుండి వెలికితీశారు