"నడుము నొప్పి" కూర్పుల మధ్య తేడాలు

 
===నొప్పికి కీలకమైన డిస్క్===
శరీరానికి ఒక ఆకృతి రావడానికి ఉపయోగపడే వెన్నుపాములో 29 వెన్నుపూసలు ఉంటాయి. మెడ భాగంలో సి1 నుంచి సి 7 వరకు మొత్తం ఏడు వెన్నుపూసలు, ఆ తరువాత రొమ్ము భాగంలో ఉండే పన్నెండు వెన్నుపూసలు డి1 నుంచి డి12. ఇక నడుము భాగంలో ఉండే వెన్నుపూసలు అయిదు. అవి ఎల్1 నుంచి ఎల్5. ఆ తరువాత కాలి ఎముకలకు ముందు ఉండే వెన్నుపూసలను ఎస్1 నుంచి ఎస్5 గా పిలుస్తారు. ప్రతి రెండు వెన్నుపూసల మధ్య మెత్తని గిన్నె లాంటి నిర్మాణం ఉంటుంది. దీన్నే [[డిస్క్]] (Intervertebral disc) అంటాం. దీని పై భాగం గట్టిగా ఉన్నా లోపల జెల్లీలాంటి పదార్థం ఉంటుంది. డిస్కులు వెన్నుపామును షాక్స్ నుంచి రక్షిస్తాయి. డిస్కులు జారడం వల్ల గానీ, అవి అరిగిపోవడం వల్ల గానీ నొప్పి మొదలవుతుంది. వెన్నుపూసల నుంచి బయలుదేరే నాడులన్నీ కలిసి పిరుదుల భాగంలో ఒక్క నాడిగా ఏర్పడి కాలి కింది భాగంలోకి వెళతాయి. ఈ నరాన్నే సయాటిక్ నరం అంటారు. డిస్కులో సమస్యలున్నప్పుడు ఏర్పడే ఏ నడుంనొప్పి అయినా ఈ సయాటిక్ నర్వ్నరం గుండా కాలిలోకి పాకుతూ వెళుతుంది. అందుకే డిస్కుల వల్ల కలిగే ఈ నడుంనొప్పిని సయాటికా (Sciatica) నొప్పి అని కూడా అంటారు.
 
====డిస్క్ జారితే====
రెండు వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు జారడాన్నే డిస్క్ ప్రొలాప్స్ (Disc prolapse) లేదా స్లిప్‌డ్ డిస్క్ (Slipped disc) అని గానీ అంటారు. డిస్కు జారడమంటే గిన్నె లాంటి నిర్మాణం మొత్తం పక్కకు జారిపోతుందని అనుకుంటారు. కానీ డిస్కు పై భాగంలో పగులులా ఏర్పడి లోపలున్న జెల్లీ పదార్థం బయటకు వస్తుంది. ఇది డిస్కు వెనుక ఉన్న సై్పనల్ నరంపై ఒరిగిపోతుంది. దానివల్ల నరం ఒత్తిడికి గురయి నొప్పి వస్తుంది. ఏ వెన్నుపూసల మధ్య ఉన్న డిస్కు జారిందన్న దాన్ని బట్టి దాని వల్ల కనిపించే నొప్పి లక్షణాలు కూడా వేరుగా ఉంటాయి. లక్షణాలను బట్టి ఏ డిస్కు జారివుంటుందో కూడా చెప్పవచ్చు. ఉదాహరణకి ఎల్4, ఎల్5 వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు జారినప్పుడు తొడ భాగంలో పక్కవైపు నుంచి కాలు కింది వరకూ నొప్పి ఉంటుంది. నడుంనొప్పి కన్నా కాళ్లలో నొప్పి ఎక్కువగా ఉంటుంది.
 
ఒక్కసారిగా పక్కకు తిరగడం, బరువు ఎత్తడం, వంగడం వల్ల నొప్పి మొదలవుతుంది. ఒక్కసారిగా కూర్చున్న చోట నుంచి లేచినా డిస్కు స్లిప్ అవుతుంది. జెర్క్ ఉన్న ఏ కదలిక వల్లనైనా డిస్కు జారవచ్చు. ఎల్5, ఎస్1 మధ్య ఉన్న డిస్కు జారితే తొడ వెనుక భాగం అంటే వెనుక వైపు తొడ నుంచి కాలి పాదం వరకూ నొప్పి ఉంటుంది.
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/676107" నుండి వెలికితీశారు