తమిళ భాష: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
== చరిత్ర ==
 
ద్రవిడ కుటుంబానికి చెందిన మిగిలిన భాషలతో పోలికలున్నప్పటికీ, తమిళం భారతదేశంలో ఉన్న చాలా భాషలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మౌలికంగా సంస్కృతంతో ప్రమేయం లేకుండా ఈ భాష ఆవిర్భవించిదన్న భావన ఉంది. ద్రవిడ భాషల్లో కెల్ల సుధీర్ఘ (రెండు వేల సంవత్సరాలకు మించిన) సాహిత్య-చరిత్ర గల భాషగా [[తెలుగు]], [[కన్నడ]] భాషల కంటే ముందే తమిళం గుర్తించబడింది.
 
తమిళ భాషకి అత్యంత దగ్గర పోలికలు గల భాష [[మలయాళం]] అని చెప్పవచ్చును. తొమ్మిదవ శతాబ్దము వరకు తమిళ మలయాళం భాషలు వేరువేరుగా గాక 'తమిళం' అనే ఒక భాషకు ఉపభాషల వలే ఉండేవి. పదమూడు-పద్నాలుగు శతాబ్దాల కాలంలో ఈ రెండు భాషలు వేరు పడి ఉండవచ్ఛని భావన.
"https://te.wikipedia.org/wiki/తమిళ_భాష" నుండి వెలికితీశారు