బైపోలార్ డిజార్డర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
| MeshID = D001714
}}
జీవితంలో మానసికంగా కొన్ని హెచ్చుతగ్గులు సర్వసాధారణం. అయితే '''బైపోలార్ డిజార్డర్''' (Bipolar disorder) ఉన్నవారిలో ఈ మానసిక అసమతౌల్యతలు విపరీతంగా ఉంటాయి. అంటే సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్‌మెంట్‌కి లోనుకావడం, అలాగే బాధగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కుంగిపోవడం జరుగుతుంది. ఎక్కువ ఎగ్జయిట్‌మెంట్‌కు లోనుకావడాన్ని హైపోమేనియా (Hypomania) అంటారు.
 
హైపోమేనియాలో ఉన్న వ్యక్తి తనను తాను చాలా శక్తిమంతుడిగా భావిస్తాడు. తిండి, నిద్ర సరిగా లేకపోయినా ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గానే ఉంటాడు. అన్నిపనులూ వేగంగా ఉంటాయి. లైంగిక ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణా జ్ఞానం తగ్గిపోతుంది. ఒక పని చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో అన్న ఆలోచన రాకపోవడం వల్ల జీవితంలో కొత్త సమస్యలు వస్తాయి.
"https://te.wikipedia.org/wiki/బైపోలార్_డిజార్డర్" నుండి వెలికితీశారు