గయోపాఖ్యానం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: తెలుగునాట ప్రఖ్యాతి చెందిన పద్యనాటకాలలో [[చిలకమర్తి లక్ష్మీ...
 
పంక్తి 1:
తెలుగునాట ప్రఖ్యాతి చెందిన పద్యనాటకాలలో [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] గారు రచించిన గయోపాఖ్యానం నాటకం ఒకటి. ఈ నాటకానికి ముందు ఇదే కథాంశంతో నాటకం వచ్చినా [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] గారు రచించిన నాటకమే చాలా ప్రాచుర్యం పొందింది.
== నాటక కథ ==
యమునా తీరంలో విహరిస్తూ శ్రీకృష్ణుడు తన చెలిగాడు కౌశికునితో తన శైశవ క్రీడలు వర్ణిస్తూ సంధ్యావందన సమయం సమీపించడంతో యమునా నదిలో దిగి దోసిలిలో నీరు తీసుకొని, సూర్యభగవానునికి అర్ఘ్యమిస్తూండగా నిష్ఠీరవం (ఉమ్మి) అతని దోసిలో వడుతుంది. శ్రీ కృష్ణునికి కోవం వచ్చి ఆ నిష్ఠీరవం వేసింది ఎవరని యమునా నదిని అడుగుతాడు. చిత్రరధుడనే గంధుర్వుడు (గయుడు) ఈ దుష్కార్యానికి పాల్పడడ్డాని తెలియడంతో అతనిని తన చక్రధారలతో ఖండిస్తానని తీవ్రంగా ప్రతిజ్ఞ చేస్తాడు. ఆకాశ యానం ముగించుకున్న గయుడు తన భార్యతో తన ఆకాశయాన విశేషాలను చెబుతు ఉండగా అతని పట్టపు ఏనుగు మరణించిందని వార్త తెలుస్తుంది. దానికి విచారిస్తున్న చిత్రరధునికి శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ ఆకాశ వాణి ద్వారా తెలియ వస్తుంది. ప్రాణభీతితో గయుడు శంకరుని మొదలుకొని అందరినీ శరణు కోరతాడు. అతనికి అభయం లభించదు. ఆ సమయంలో నారదుడు ద్వైతవనంలో ఉన్న అర్జునుని శరణుకోరమని సలహా ఇస్తాడు. శ్రీకృష్ణునికి అత్యంత ఆప్తుడైన అర్జునుడు తనకు శ్రీకృష్ణుని వలన ప్రాణభయం కలింగిందంటే ఏ విధంగా అభయమిస్తాడని సందేహం వ్యక్తం చేస్తాడు గయుడు. అందుకు నారదుడు ముందుగా శరణు కోరి పిమ్మట తనకు ఆపద ఎందుకు వచ్చిందో తెలుప మంటాడు. అదే విధంగా గయుడు ఆర్తనాదం చేస్తూ అర్జునుని సమీపిస్తాడు. ఆర్తత్రాణ పరాయుణుడైన అర్జునుడు ఆర్తనాదం వింటూనే గయునికి అభయమిస్తాడు. గుయుడు ప్రాణభయం తీరి సేదతీరిన పిమ్మట
"https://te.wikipedia.org/wiki/గయోపాఖ్యానం" నుండి వెలికితీశారు