"వాడుకరి చర్చ:Vu3ktb/పాతచర్చలు 7" కూర్పుల మధ్య తేడాలు

మరింత చెత్త తొలగింపు
(పాత చర్చలు వేరే పుటలోకి బదిలీ)
 
(మరింత చెత్త తొలగింపు)
 
నేను మళ్ళి మళ్ళి ఈ విషయంలో చర్చించను. ప్రస్తుతానికి నాకు బెంగుళూరు బదిలీ అయినందువల్లన కొంత dislocate అయ్యి ఇంటర్ నెట్ కనెక్షన్ కూడ ఇంకా ఏర్పడలేదు.ఇంతటితో ఈ విషయం ముగించండి. దయచేసి, చురుకుగా పనిచేస్తున్న సభ్యులను నిరుత్సాహ పరిచే వ్యాఖ్యలు చెయ్యటం ఇకనైనా మానుకోండి. శలవు.నమస్కారం.--[[వాడుకరి:Vu3ktb|S I V A]] 08:55, 2 ఏప్రిల్ 2009 (UTC)
 
;నా సమాధానాలు
#సభ్యతను అంచనా వేయడానికి అవతలి వ్యక్తిని బహువచనంలో ఉచ్ఛరించడమొక్కటి మాత్రమే అర్హత అనుకుంటున్నారు. అది ఎంతమాత్రం కాదు. తెవికీలో దేశాధినేతలు, మహానుభావులను కూడా ఏకవచనంలో మనం ప్రయోగించడం లేదా? అలా అనుకుంటే తెవికీలో పనిచేసే సభ్యులలో ఒక్కరికి మాత్రమే సభ్యత ఉందని అనుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది.
#నేను చేసిన వ్యాఖ్యలను తొలగించినందుకు నాకేమీ కోపం లేదు, బాధ అసలే లేదు. ఆ విషయం స్పష్టం చేశాను కూడా. కాని తెవికీ సంప్రదాయం గురించి వ్రాసిన వ్యాఖ్యను ఆనవసర విషయంగా సారాంశంలో వ్రాయడమే బాధ కలిగింది. ఇది నాకే కాదు మిగితా సభ్యులకూ బాధ కలిగించాల్సిన విషయమే. వ్యక్తిని విమర్శించడం వేరు, వ్యవస్థను విమర్శించడం వేరు. నాకు ప్రత్యేకంగా విమర్శించిననూ నేను నిగ్రహించుకోగలనేమో కాని ఎన్నో సంవత్సరాల నుండి వందలాది సభ్యుల కృషి మూలంగా ఎదుగుతున్న తెవికీ సంప్రదాయాన్ని అనవసర విషయంగా కొట్టివేయడం భాధపడవలసిందే.
#ఇక్కడ హెడ్మాస్టర్లు, పిల్లలు ఎవరూ లేదు. అంతా సమానమే. అయితే వ్యక్తుల మధ్య తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి. ఒకరికి తెలియని విషయాలు మరొకరికి తెలిసిఉంటాయి. ప్రపంచ విజ్ఞానం ఇంత పురోభివృద్ధి సాధించిందంటే అదే కారణం. తెవికీ పురోగమనానికి కూడా అదే కారకం కావాలి. ఇందులో అన్ని విషయాలు తెలిసిన వారు, ఏమీ తెలియని వారు ఎవరూ లేరు. ఒకరి నుండి మరొకరు తెలుసుకుంటూ వ్యవస్థ పురోగమనానికి పాటుపడాల్సి ఉంటుంది. నాకు అన్నీ తెలుసూ మిగితా సభ్యులు నేను చెప్పిందే వినాలి అని ఎవరూ అనడం లేదు. కొత్త సభ్యుడైననూ అతను చెప్పిన విషయం తెవికీకి పాటు పడుతుంది అనుకుంటున్నప్పుడు నిర్వాహకులైననూ దాన్ని పాటించాల్సిందే.
#నియమాలు వేరు, సంప్రదాయాలు వేరు. సంప్రదాయం పాటించడమనేది సభ్యత కిందికి వస్తుంది. నియమాల వలె సంప్రదాయాలను బలవంతంగా అమలు చేయలేము. సంప్రదాయాలు మునుముందు నియమాలు కావచ్చు, అది వేరే విషయం. నేను చెప్పింది సంప్రదాయమే కాని నియమం కాదు. ప్రత్యేక కారణం ఉంటే తప్ప బొమ్మను అప్‌లోడ్ చేసిన వెంటనే మొదటి పేజీ ప్రదర్శనకై ఉంచడం కంటే కొంతకాలం వేచిఉండటం సమంజసం. ఈ బొమ్మకు సభ్యులు అభ్యంతరాలు చెబుతారని కాదు కాని బొమ్మలపై సభ్యులు అభ్యంతరాలు చెప్పే అవకాశం మాత్రం ఉంటుంది, ఆ అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది కూడా.
#చర్చా పేజీలో వ్యాఖ్యలు చేసే అవసరం లేదు అని చెప్పడానికి వీలుండదు. ఎందుకంటే ఇది సమిష్టి కృషితో కొనసాగుతున్న బృహత్కార్యం. సభ్యుల కృషిని మెచ్చుకోవడం, పొరపాట్లను తెలియజేయడం కూడా సంప్రదాయమే. పొరపాట్లను తెలియజేసినంతమాత్రాన ఎదుటివారికి ఏమీ తెలియదు అని నేను అనుకోవడం లేదు. నాకే అన్ని విషయాలు తెలుసూ అని చెప్పడం లేదు. నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. నాకంటే అధికంగా తెలిసిన వారు తెవికీలో చాలా సభ్యులున్నారు. ఇప్పటికీ వారి నుంచి నేను తెలుసుకుంటూనే ఉన్నాను. దానికి నా చర్చా పేజీలే మూగసాక్షి.
#ఇక్కడ అల్లరి ఎవరు చేస్తున్నారు. సంప్రదాయం కాదని బొమ్మ ప్రదర్శనను ఈవాబొ పేజీ నుండి తొలిగించి ఆ విషయం చర్చా పేజీలో వ్రాసానంతే. అది అల్లరి ఎలా అవుతుంది. ఈ విధంగా చేయడమూ సంప్రదాయమే. ఇంతకు మించి నేను చేసిందేమీ లేదు. దానికి కారణం తెలుసుకుంటే సరిపోయేది. అలా కాకుండా నేను వ్రాసిన వ్యాఖ్యను తొలిగించి తెవికీ సంప్రదాయాన్ని అనవసర వ్యాఖ్యగా పరిగణించుటే నాకు బాధ కలిగింది. తొలిగించే పనులు కొత్త సభ్యులు చేయరు. ఈ బొమ్మ ఎంతో అరుదైనది, దీనికి ఈ ప్రత్యేకత ఉంది కాబట్టి దీన్ని ఈవాబొగా పరిగణిద్దాం అని దాని చర్చా పేజీలో ముందే తెలియజేస్తే బాగుండేది. సభ్యుల పరిశీలనకు వచ్చేది. అంతకు మించి నేనేమీ చెప్పను.
#చురుగ్గా ప్రవర్తించే సభ్యులను నిరుత్సాహ పర్చడం అలాంటి వ్యాఖ్యలు చేయడం నా ఉద్దేశ్యం కాదు. సంప్రదాయం తెలియజేసినంతమాత్రాన సభ్యులను నిరుత్సాహపర్చినట్లు అనుకోవడం బాగుండదు. ఈ వ్యాఖ్యను నాకు చెప్పే అవసరం ఎందుకో అర్థం కావడం లేదు. తెవికీ పద్దతులు, సంప్రదాయాన్ని చెప్పినప్పుడు అది నిరుత్సాహం కలిగిస్తుందంటే నేనేమీ చేయలేను.
#నేను కూడా ఈ విషయంలో చర్చను పొడిగించాలనుకోవడం లేదు.--[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#4c22e6;color:white;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:red;color:white;"><b>-చర్చ</b></font>]] 19:27, 2 ఏప్రిల్ 2009 (UTC)
: శివగారూ, మీ దిద్దుబాట్ల మీద చేసిన వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోవద్దు. మీ రచనలను విమర్శించటానికి, మిమ్మల్ని విమర్శించటానికి చాలా తేడా ఉందని మీలాంటి పెద్దలకు నేను చెప్పవలసిన అవసరం లేదనుకుంటా. నేను వచ్చిన కొత్తలో చాలా ఉత్సాహంతో పేజీల సంఖ్య పెంచడానికి ఆంగ్ల వికీలో ఉన్న వ్యాసాలు ఇక్కడ పెద్ద సంఖ్యలో అతికించాను. అప్పుడు ఒక ఆకాశరామన్న నన్ను [[వాడుకరి చర్చ:వైజాసత్య/పాత చర్చ 1|ఇక్కడ]] మందలించారు చూడండి. అప్పుడో వికీలో ఏదో ఒకటి వ్రాస్తున్నది నేను ఒక్కన్నే. "వ్రాసేది లేదుగానీ, నేనోదే చేస్తుంటే ఎంత ధైర్యం నన్ను విమర్శించడానికి" అని ఉక్రోషం వచ్చింది కూడా. కాస్త నెమ్మదించి ఆలోచిస్తే ఆయన/ఆమె అన్నది నిజమే కదా అనిపించింది. --[[వాడుకరి:వైజాసత్య|వైజాసత్య]] 01:33, 3 ఏప్రిల్ 2009 (UTC)
 
3,487

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/679948" నుండి వెలికితీశారు