అబుల్ హసన్ కుతుబ్ షా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==గోల్కొండ పతనం==
[[File:Mir Jumla.jpg|thumb|గోల్కోండ విస్తరణకు పతనానికి కారకుడు నమ్మకద్రోహి మీర్ జుమ్లా]]
[[File:Mir Jumla.jpg|thumb|Mir Jumla]]
తానీషా కంటే ముందు చక్రవర్తిగా ఉన్న తానీషా మామ, [[అబ్దుల్లా కుతుబ్ షా]]ను దక్కన్లో [[మొఘల్ సామ్రాజ్యము|మొఘల్]] సేనానిగా ఉన్న [[ఔరంగజేబు]] ఓడించి [[మొఘల్ సామ్రాజ్యము|మొఘల్]] చక్రవర్తి [[షాజహాను]] యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించి కప్పం కట్టే విధంగా ఒప్పందం కుదిర్చాడు. మొగలుల దండయాత్రల నుండి గోల్కొండను రక్షించడానికి మహారాష్ట్ర నాయకుడైన [[శివాజీ]]తో అబుల్ హసన్ సంధి కుదుర్చుకున్నాడు. 1680లో శివాజీ మరణం తరువాత 1685లో ఔరంగజేబు తన కుమారుడైన షా ఆలం నాయకత్వంలో గోల్కొండ పైకి దండయాత్ర చేశాడు. మొదట గోల్కొండకే విజయం లభించినా, చివరకు కొందరు సేనానుల నమ్మకద్రోహం వలన గోల్కొండ సైన్యాలు ఓడిపోయాయి. పర్యవసానంగా అబుల్ హసన్ మొగలులతో సంధి చేసుకున్నాడు. సంధి షరతుల ప్రకారం అబుల్ హసన్ బకాయిల క్రింద కోటి హొన్నులు చెల్లించాలి. సంవత్సరానికి రెండు లక్షల హొన్నులు కప్పం చెల్లించాలి. మల్ఖేడు ప్రాంతాన్ని మొగలాయిలకు అప్పగించాలి. అక్కన్న, మాదన్నలను ఉద్యోగాల నుండి తొలగించాలి.