చివరకు మిగిలేది (నవల): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 61:
 
 
బుచ్చిబాబు నవల శరీర, మానసిక, హృదయ, ఆత్మ సంస్కారాలకు సంబంధించిన మీమాంస. కోమలి చవరికిచివరికి తానున్న కుటీరపు దహనంలో, జ్వాలల్లో చిక్కుకుపోవడం, దయానిధి ఆమెను రక్షించడం, తనకు తోడుగా ఎటో తిసికెళ్ళితీసుకెళ్ళి పోవడం కూడా దహన సంస్కారపు ఆత్మ సంస్కారంలోని భావమే. దయానిధి తల్లి శిలా విగ్రహం తల పగిలినా ఆమె పాదాలు ఇంకా నిలిచి ఉండడం ఈ సమాజపు సంస్కారంలో భాగమే. రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలోని మధ్య తరగతి మందహాసంలోని భాగస్థులే నిజాయితీ లేని దశరథ రామయ్య, గోవిందరావు, కృష్ణమూర్తి, జోగప్ప నాయుడు, గుర్నాధం, ప్రకాశరావు, అరూపానందస్వామి, శిష్యులు జీవ సజీవలు. మరీ ముఖ్యంగా రాజభూషణంలు. వారికి చివరికి మిగిలేదేమిటనే ప్రశ్నే రాదు. ఎంత అదృష్టవంతులు వాళ్ళు. నారన్న నౌకరే అయినా అతనికి దయానిధిపైనున్న ప్రేమ మిగిలింది. అనంతాచారికి ఆదరణ మిగిలింది. వైకుంఠానికి కృతజ్ఞత మిగిలింది. నవలలోని అగ్రవర్ణాలవాళ్ళు సుఖపడింది లేదు వాళ్ళ కృతక నీతివలన. నిమ్న వర్ణాలలోని కామాక్షి, కోమలులు ఇంతకంటే నష్టపోయేది ఏమీ లేదు. జగన్నాధం కృతకమైన తెలుగులో మాట్లాడుతాడు. ఆ వెక్కిరింపు సమాజం పట్లనే. అతనే గనుక సహజమైన భాషలో మాట్లాడి ఉంటే దయానిధి అస్తిత్వ వేదన అతన్ని కాల్చేసేది. '''చివరికి మిగిలేది''' నవలలో మాతృ ప్రేమ, స్వీయ ప్రేమల వికృతులు చివరికి ద్వేష రాహిత్యంలో ప్రేమ సాఫల్యాన్ని పొంది విశ్రాంతినొందిన నవల. <ref name="vegunta"/>