కాకి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
కాకుల నేస్తం.సుక్లా శ్రీను (35) 'కాకుల శ్రీను'గా ముద్రపడ్డాడు.విశాఖ జబ్బర్‌పేట వాసులు కాకుల శ్రీను అని పిలుస్తారు. కాకులను ఆదరిస్తూ వాటికి ఆహారం పెట్టేవాడు.కాకులకు ఆహారం వేశాక హార్బర్ గోడమీద నుంచి చేపలు పడుతూ సముద్రంలో పడి గల్లంతయ్యాడు. మత్స్యకార కుటుంబానికి చెందిన శ్రీనివాస్ హార్బర్‌లో చేపలను గ్రేడింగ్ చేసే పని చేస్తుంటాడు. రోజూ ఉదయం, సాయంత్రం కాకులకు ఆహారాన్ని, చిరుతిళ్లను కొని మరీ వేస్తుంటాడు, ఇతన్ని చూస్తే చాలు కాకులు తలపై, చేతులపై, కాళ్లపై వాలిపోతాయి. ఆయనకు భార్య మహలక్ష్మి, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. శ్రీనుకు చేపలవేటే ఆధారం. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ఫిషింగ్ హార్బర్ పదో నెంబరు జట్టీ వద్దకు చేరుకోవడం ద్వారా అతని దినచర్య ఆరంభమవుతుంది. అతనిని చూసిన వెంటనే ఎక్కడెక్కడి కాకులు వచ్చేస్తాయి. వాటికి తన వెంట తెచ్చిన గింజలు, రొట్టెముక్కలు వేస్తుంటాడు. గత పదేళ్లుగా ఇది నిత్యకృత్యం. చుట్టుపక్కల చేప పిల్లలు ఉన్నా సరే పట్టించుకోకుండా కాకులన్నీ ఈయన వద్దకు చేరుకుని అతని పైకి ఎక్కి కూర్చొనేవి. వాటికి ఆహారం పెట్టిన తరువాత గాని గేలంతో చేపలు పట్టేవాడు కాదు. రూ.50 సంపాదిస్తే అందులో రూ. 30 వరకు కాకుల కోసమే వెచ్చించేవాడు,శ్రీనుకు గతంలో మూర్చవ్యాధి ఉండేదట. శ్రీను పడిపోతున్న సమయంలో అక్కడే ఉన్న కాకులు గుంపులు గుంపులుగా పరిసర ప్రాంతమంతా చక్కెర్లు కొట్టాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. (ఈనాడు18.10.2009)
{{wiktionary}}
{{wikiquote}}
 
[[వర్గం:పక్షులు]]
"https://te.wikipedia.org/wiki/కాకి" నుండి వెలికితీశారు