కృష్ణ జననం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
దేవకీ దేవి ఏడవ మారు గర్భం ధరించి నప్పుడు,[[విష్ణువు]] తన మాయతో ఆమె గర్భాన్ని [[నందనవనం]] లో [[నందుడు|నందుడి]] భార్య [[రోహిణి]] గర్భంలో ప్రవేశ పెడతాడు. ఈ గర్భం వల్ల రోహిణికి [[బలరాముడు]] జన్మిస్తాడు. చెరసాలలో దేవకికి గర్భ స్రావం అయిందని అనుకొంటారు. కొన్ని రోజులకు దేవకీ దేవి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది. దేవకీదేవి ఎనిమిదో మారు గర్భం ధరించి నప్పుడు కంసుడికి చెడు శకునాలు, మృత్యు భీతి కలుగుతుంది. [[విష్ణువు|లక్ష్మీనాథుడు]] దేవకి గర్భములో ఉండడం చూసి దేవతలు , యక్ష, కిన్నర ,కింపురుషులు దేవకీ దేవి ఉన్న చెరసాల కు వచ్చి స్తుతిస్తారు.
 
[[File:Raja Ravi Varma, Kamsa maya (1890).jpg|thumb|ఎడమ|కంసునితో మాట్లాడుతున్న యోగమాయ]]
దేవకి గర్భం నుండి [[శ్రావణ శుద్ధ అష్టమి]] తిథి నాడు విష్ణువు శ్రీకృష్ణుడై రోహిణీ నక్షత్ర యుక్తమైనప్పుడు జన్మిస్తాడు. కృష్ణుడు జన్మించాక వసుదేవుడు ఏదో దైవంతో ప్రేరేరింపబడినట్లు, కృష్ణుడిని పొత్తిళ్ళలో పెట్టుకొని, చెరసాల బయట నిద్ర పోతూ ఉన్న కావలి వాళ్ళను తప్పించుకొని, [[యమున|యమునా]] నది వైపు బయలు దేరుతాడు. యమునానది వసుదేవుడు రావడం చూసి రెండుగా చీలి పోతుంది. యమునా నది నుండి బయలు దేరి నందనవనం లో తన స్నేహితుడైన నందుని ఇంటికి వెళ్ళి [[యశోద]] ప్రక్కన ఉన్న శిశువు ప్రదేశం లో శ్రీకృష్ణుడిని విడిచి ఆ శిశువు ను తీసుకొని తిరిగి చెరసాలకు వస్తాడు. చెరసాలకు చేరిన వెంటనే ఆ శిశువు ఏడుస్తుంది. ఆఏడుపు విన్న కావలి వారు నిద్ర లేచి దేవకీ దేవి ఎనిమిదోమారు ప్రసవించింది అని కంసుడు కి చెబుతారు. ఆ మాట విన్న కంసుడు చెరసాలకు వస్తాడు. ఆ శిశువును తీసుకొని చంపడానికి పైకి విసరబోతుంటే దేవకీ దేవి "నీకు పుట్టింది మేనకోడలు,చంపొద్దు" అని వేడుకొంటుంది. కంసుడు ఆమాట వినక, శిశువును సంహరించడానికి పైకి విసురుతాడు. అలా పైకి విసరబడిన శిశువు ఎనిమిది చేతులతో శంఖ చక్ర గదా శారంగాలతో ఆకాశం లోకి లేచి పోయి తాను యోగ మాయ నని కంసుడిని చంపేవాడు వేరే చోట పెరుగుతున్నాడని చెప్పి మాయం అవుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/కృష్ణ_జననం" నుండి వెలికితీశారు