ఉత్తర రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
 
===సీత భూప్రవేశం===
[[File:Raja Ravi Varma, Sita taken by Goddess Earth.jpg|thumb|సీతా దేవిని తీసుకు వెళుతున్న భూదేవి - రాజా రవివర్మ చిత్రం]]
సీత కాషాయాంబరాలు ధరించి ఒక్క మాటు చూసింది. రెండు చేతులు జోడించింది. సభా భవనంలోని గాలిలో చల్లని కమ్మని పరిమళాలు వ్యాపించసాగాయి. అప్పుడు సీత ఇలా అంది" నేను రాముడ్ని తప్ప అన్యుల్ని తలచనిదాననే అయితే భూదేవి నా ప్రవేశానికి వీలుగా దారి ఈయాలి. త్రికరణ శుద్ధిగా నేనెప్పుడూ రాముని పూజించేదాన్ని అయితే [[భూదేవి]] నా ప్రవేశానికి మార్గం చూపాలి" అని ప్రార్ధించింది సీతా దేవి ప్రార్ధన ముగించీ ముగించగానే భూమి బద్దలు అయింది. నాగరాజులు మోస్తున్న దివ్య సింహాసనమొకటి పైకి వచ్చింది. దానిలో ఆసీనురాలయిన భూమాత రెండు చేతులతో సీతను తీసుకొని పక్కన పొదవి కూర్చోపెట్టుకొంది. ఆకాశం నుంచి పూల వాన కురుస్తుండగా సింహాసనం పాతాళంలోకి దిగిపోగా అక్కడ ఏమీ జరగనట్టు మళ్ళీ మామూలుగా అయిపోయింది. సభాసదులు దీనులై విలపిస్తూ రాముడి వంక చూడసాగారు. రాముడి దుఃఖానికి అంతే లేదు. "నా కన్నుల ముందే నా భార్య మాయమయింది. లంకలో నుంచి తీసుకొని వచ్చిన ఆమెను భూమినుండి తెచ్చుకొనలేనా? భూదేవీ! అత్తగారివైన నిన్ను మర్యాదగా అడుగుతున్నాను. తక్షణం సీతను తెచ్చి ఈయకుంటే జగత్ప్రళయం సృష్టిస్తాను." అన్నాడు. అప్పుడు [[బ్రహ్మ]] వారించి "రామా ! ఇది నీకు తగదు. నిన్ను స్వర్గధామంలో తప్పక కలుసుకొంటుంది. నీ చరిత్ర ఇతిహాసంగా ఉండిపోతుంది. ఇప్పటి దాకా నువ్ జరిగినది విన్నావు. ఇక జరగబోయేది కూడా మహాముని రాసి ఉన్నాడు. అది నీవు, మునులు మాత్రమే వినాలి " అని చెప్పి వెళ్ళిపోయాడు.
 
===లక్ష్మణునికి ధర్మ సంకటం===
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_రామాయణం" నుండి వెలికితీశారు