రామదేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
=='''తొప్పూరు యుధ్ధం'''==
అంతర్యుధ్ధంలో ఓడిపోయిన జగ్గారాయుడు మొదట అడవుల్లోకి పారిపోయినా తర్వాత మదురై, జింజి నాయకుల సహాయం కోరాడు. అప్పటికే [[విజయనగర సామ్రాజ్యం]] నుండి విడిపోయి సొంత పాలన చేయాలని వున్న మదురై మరియు జింజి నాయకులు, యాచమ నాయుడు మరియు రామ దేవుడి మీదకు దండెత్తారు. యాచమ నాయుడు మరియు రామ దేవుడు [[తంజావూరు నాయకుల]] సహాయం కోరగా, విజయనగర పాలనను గౌరవిస్తున్న తంజావూరు నాయకులు అందుకు సమ్మతించారు.
 
==='''సైన్యం'''===
జగ్గారాయుడు, మదురై, జింజి నాయకులు మరియు కొందరు [[పోర్చుగీసు]] వారు [[తిరుచ్చిరాపల్లి]] వద్ద పెద్ద సైన్యాన్ని మోహరించారు. యాచమ నాయుడు [[వెల్లూరు]] నుండి తన సైన్యాన్ని తీసుకొని బయలుదేరాడు. అతనికి దారిలో తంజావూరు నాయకుడి సైన్యం కలిసింది. [[కర్ణాటక]] నుండి కొంత, [[డచ్చి]] మరియు [[జాఫ్నా]] సైన్యాలు కూడా కలిశాయి.
 
1616 చివరి మాసాల్లో రెండు సైన్యాలు తిరుచ్చికి సమీపంలో [[కావేరీ నదికి]] ఉత్తరాన ఉన్న తొప్పూరు అనే ప్రదేశంలో ఎదురుపడ్డాయి. రెండు సైన్యాలు కలిపి పది లక్షల సైనికులు పోరాడిన ఈ యుధ్ధం [[దక్షిణ భారతదేశంలో]] జరిగిన అతిపెద్ద యుధ్ధాలలో ఒకటిగా చెప్పబడింది.
 
==='''ఫలితం'''===
రాజ సైన్యం ధాటికి జగ్గారాయని సైన్యం నిలువలేకపోయింది. సైన్యాధ్యక్షులైన యాచమనాయుడు, తంజావూరు [[రఘునాథ నాయకుడు]] సైన్యాన్ని ఎంతో క్రమశిక్షణతో నడిపించారు. జగ్గారాయని సోదరుడైన యెతిరాజు ప్రాణాల కోసం పారిపోయాడు. [[మదురై నాయకుడు]] పారిపోవాలని చూసినా [[తిరుచ్చి]] దగ్గర పట్టుబడ్డాడు. [[వేంకటపతి దేవ రాయల]] కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడు కూడా పట్టుబడ్డాడు. జింజీ నాయకుడు ఒక్క [[జింజీ కోట]] తప్ప మిగతా అన్ని కోటలను కోల్పోయాడు. 1617 మొదట్లో యాచమ మరియు [[తంజావూరు నాయకులు]] 15 ఏళ్ళ రామ దేవుడిని రామ దేవ రాయలుగా పట్టాభిషేకం చేశారు.
 
=='''కొనసాగిన వైరం'''==
జగ్గారాయని సోదరుడైన యెతిరాజు మరలా జింజీ నాయకుని సహాయంతో [[తంజావూరు]] మీదకు దండెత్తినా జయించలేక పట్టుబడ్డాడు. చివరకు గెలవలేక తన కుమార్తెను రామదేవునికిచ్చి వివాహం చేశాడు. వేంకటపతి దేవ రాయల కుమారుడిగా చెప్పబడుతున్న బాలుడు 1619లో మరణించడంతో రామదేవునికి పరిస్థితులు చక్కబడ్డాయి.
 
==='''కర్నూలు చేజారుట'''===
అంతర్యుధ్ధాన్ని ఆసరాగా చేసుకొని [[ఆదిల్షాహీ వంశము|బీజాపూరు సుల్తాను]] 1620లో [[కర్నూలు]] మీదకు సైన్యాన్ని పంపినా జయించలేక మరల 1624లో ఆ ప్రాంతాన్ని పూర్తిగా వశపర్చుకున్నాడు.
 
==='''యాచమ'''===
అంతర్యుధ్ధం తర్వాత సర్వసైన్యాధ్యక్షుడైన యాచమ నాయుడు యెతిరాజు కుమార్తెతో రామ రాయల వివాహాన్ని వ్యతిరేకించినా, రామరాయలు లెక్క చేయక వివాహం చేసుకున్నాడు. ఇది అవమానంగా భావించిన యాచమనాయుడు ముసలివాడైన తనని రాజాస్థానం నుండి విరమింపచేయాలని కోరాడు. ఇప్పుడు రామ రాయలికి మామ అయిన యెతిరాజు, అంతర్యుధ్ధం సమయంలో జగ్గారాయని నుంచి స్వాధీనం చేసుకున్న గొబ్బూరు ప్రాంతాన్ని తిరిగి ఇవ్వాలని యాచమ నాయుడిపై ఒత్తడి తెచ్చాడు. అందుకు సమ్మతించని యాచమనాయుడిపై తంజావూరు మరియు జింజీ సైన్యాల సహాయంతో రాజ సైన్యం యచమ నాయుడు పాలిస్తున్న ప్రాంతాలపై దండెత్తింది. యాచమ నాయుడి సైన్యం చిన్నదైనా ఎంతో గొప్పగా పోరాడి యెతిరాజు సైన్యాన్ని నిలువరించింది. ఎంతోకాలం సాగిన ముట్టడి తర్వాత గొబ్బూరు ప్రాంతాన్ని తిరిగి ఇవ్వడానికి యాచమ నాయుడు సమ్మతించాడు. [[పులికాటు]], [[చెంగల్పట్టు]] మరియు [[మధురాంతకం]] ప్రాంతాలు పూర్తిగా [[వెల్లూరు]] ఏలుబడిలోకి వచ్చాయి. [[వెంకటగిరి]] ప్రాంతాన్ని పాలించడానికి యాచమనాయుడికి అవకాశం వున్నా తన చివరి రోజులను ఉదయారుపాళ్యం సేనాపతి రక్షణలో గడపడానికి నిశ్చయించుకున్నాడు.
 
=='''వారసుడు'''==
వారసులు, సోదరులు లేని రామ రాయలు, [[ఆనెగొందిని]] పాలిస్తున్న వరుసకు సోదరుడు, [[ఆళియ రామ రాయల]] మనవడు అయిన పెద వేంకట రాయుడిని ([[మూడవ వేంకట రాయలు]]) వారసుడిగా ప్రకటించి 30 ఏళ్ళ వయసులో 1632లో 15 ఏళ్ళ పాలన చేసి మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/రామదేవ_రాయలు" నుండి వెలికితీశారు