షావుకారు జానకి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''షావుకారు జానకి'''గా ప్రసిద్ధిచెందిన '''శంకరమంచి జానకి''' (జ. 1932 డిసెంబరు 12) అలనాటి తెలుగు సినీ కథానాయిక. తండ్రి టి. వెంకోజీరావు పేపర్ పరిశ్రమలో నిపుణుడు, తల్లి పేరు శచీదేవి. '''జానకి''' 1932 సంవత్సరం [[పశ్చిమ బెంగాల్]] లో జన్మించింది.<!-- (సరి చూడాలి. ఆంగ్ల వికీలో "రాజమండ్రి" అని ఉంది) --> . ఈమె అస్సాం గౌహతిలో మెట్రిక్యులేషన్ వరకు చదివింది. అరిజోనా విశ్వవిద్యాయంలో గౌరవ డాక్టరేట్ పొందింది.
 
ఈమె 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మళయాళం సినిమాలోను నటించింది. అనేఅనేక రంగస్థల నాటకాలలో కూడా నటించింది. తన 11వయేటనే రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. ఈమె మొట్టమొదటి చిత్రం [[షావుకారు]] ఈమె ఇంటి పేరైపోయింది. ప్రముఖ తెలుగు కథానాయకి [[కృష్ణకుమారి]] ఈమెకు స్వయానా చెల్లెలు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పని చేసింది. ఈమె [[సత్యసాయిబాబా]] భక్తురాలు.
 
 
"https://te.wikipedia.org/wiki/షావుకారు_జానకి" నుండి వెలికితీశారు