లక్షద్వీప్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
 
== చరిత్ర ==
లక్ష ద్వీపములగురించినద్వీపముల గురించిన ప్రస్థావన మొట్టమొదటిగా తమిళ సాహిత్యమైన '''పురనానూరు''' లో ఉంది. ఇది పురాతన ద్రవిడదేశంలో ఒక భాగంగా ఉండేది. సంగకాల తమిళ సాహిత్య పరిశోధనలో ఈ ప్రాంతం '''చేర''' దేశ ఆధీనంలో ఉండేదని కనిగొనబడింది. 7వ శతాబ్ధంలో పల్లవుల వ్రాలలో ఈ ద్వీపాలు పల్లవసామ్రాజ్యా ఆధీనంలో ఉన్నట్లు ప్రస్థావించబడింది. కేరళదేశపు చివరిరాజైన '''చేరమాన్ పెరుమాళ్ ''' సమంలో ఈ ద్వీపాలకు సంబంధించిన మొట్టమొదటి ఒప్పదం జరిగినట్లు ప్రాంతీయ సంప్రదాయాలు, చరిత్ర మరియు విశేషాలు తెలియజేస్తున్నాయి. ఈ ద్వీపసముదాయంలో అతిపురాతనంగా నివసించిన ద్వీపాలు వరుసగా '''అమిని, కల్పేని, ఆండ్రాట్ట్, కవరాట్టి మరియు అగాట్టి'''. లక్షద్వీప నివాసులు మొదట హిందువులుగా ఉండి తరువాత క్రీ శ 14వ శతాబ్ధంలో ఇస్లామ్ మతస్థులుగా మారారు. ఏదిఏమైనప్పటికి సమీపకాలంలో జరిగిన పురాతత్వ పరిశోధనలలో క్రీ శ 6-7 శతాబ్ధముల మద్య కాలములో బౌద్ధులతో ఒక ఒప్పాందం జరిగినట్లు ధృవీకరించబడింది. ఇక్కడ ప్రాబల్యమున్న సంప్రదాయాననుసరించి ఏ.డి 661 లో '''ఉబైదుల్లా''' అను అరబ్‌దేశీయుడు లక్షద్వీపాలకు ఇస్లామ్ మతాన్ని తీసువచ్చాడని భావించబడుతుంది. ఆయన సమాధి '''ఆండ్రాట్ట్''' ద్వీపములో ఉంది. సమాధి మీద ఏ.డి 756 తారీఖు వేసి ఉంది. 11వ శతాబ్ధంలో ద్వీపవాసులు '''చోళ''' రాజుల పాలనలోకి వచ్చారు. 17వ శతాబ్ధంలో ఈ ద్వీపాలు '''అలి '''రాజ్య (అరక్కల్ బీవి ఆఫ్ కానూరు)ఆధీనంలోకి వచ్చింది. దీనిని ఆమెకు '''కొలాతిరీలు''' బహుమతిగా ఇచ్చారు. పోర్చుగీసు వారు దీనిని స్వాధీనపరచుకొని '''కొబ్బరి పీచు''' ఉత్పత్తిని చేపట్టి ద్వీపవాసులు వారిని తరిమి కొట్టే వరకు ఉతప్పత్తిని కొనసాగించారు. ద్వీపవాసులు అరబ్ పర్యాటకుడు '''ఇబ్న్ బటువా''' గురించిన క్ధలను గొప్పగా వివరిస్తుంటారు.
 
1787 లో అమిందివి '''ద్వీపసముదాయం'''(ఆమిని, కాడ్మట్, కిల్తాన్, చెట్లత్ మరియు బిత్రా)టిప్పు సుల్తాన్ అధీనంలోకి వచ్చాయి. '''మూడవ ఆంగ్లో- మైసూరు ''' యుద్ధం తరువాత ఈ ద్వీపాలు దక్షిణ కన్నడదేశంతో ఆంగ్లేయుల ఆధీనంలోకి వచ్చాయి. మిగిలిన ద్వీపాలు కన్ననూరుకు చెందిన అరక్కల్ కుంటుంబంలో స్వాధీనంలో సామంతరాజ్యంగా ఉంటూ వచ్చింది. కప్పం కట్ట లేదన్న నెపంతో బ్రిటన్ ఈ ద్వీపసముదాయాలను తన ఆధీనంలోకి తీసుకుంది. బ్రిటిష్ కాలంలో ఈ ద్వీపాలు మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన మలబారు జిల్లాకు చెంది ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/లక్షద్వీప్" నుండి వెలికితీశారు