మిరపకాయ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
== చరిత్ర ==
అమెరికాలోని ప్రజల ఆహారంలో మిరపకాయలు భాగం కావడమనేది దాదాపు క్రీ.పూ. 7500 నాటినుంచే ప్రారంభమైంది. పురాతత్వశాస్త్ర సాక్ష్యాధారాల ప్రకారం, నైరుతి [[ఈక్వడార్|ఈక్విడార్‌]]లో కొలువై ఉన్న ప్రాంతాల్లో 6000 సంవత్సరాలకు పైగా కాలం నుంచి మిరపకాయల పెంపకం అమలులో ఉంటోంది<ref>పెర్రి, L. ''et al.'' 2007. స్టార్చ్ ఫొస్సిల్స్ అండ్ ది డొమెస్టికేషన్ అండ్ డిస్పర్సల్ అఫ్ చిల్లి పెప్పర్స్ (కాప్సికం spp. L.) ఇన్ ది అమెరికాస్. ''సైన్స్'' 315: 986-988. [http://scholar.google.com/scholar?cluster=5723774509129214407 లింక్ ]</ref><ref>BBC న్యూస్ ఆన్ లైన్. 2007. మిరపకాయలు వేపించిన ప్రాచీన వంట. శుక్రవారం, 16 ఫిబ్రవరి. http://news.bbc.co.uk/2/hi/americas/6367299.stm. నుండి లభ్యం 16 ఫిబ్రవరి 2007 గ్రహింపబడినది.</ref>. అలాగే మధ్య మరియు దక్షిణ అమెరికాల్లో<ref>{{cite web|url=http://www.hort.purdue.edu/newcrop/proceedings1996/V3-479.html |title=Bosland, P.W. 1996. Capsicums: Innovative uses of an ancient crop. '&#39;p. 479-487. In: J. Janick (ed.), Progress in new crops. ASHS Press, Arlington, VA.'&#39; |publisher=Hort.purdue.edu |date=1997-08-22 |accessdate=2010-12-23}}</ref> మొట్టమొదట సాగు చేయబడిన పంటల్లో మిరప కూడా ఒకటిగా ఉండడంతో పాటు ఈ పంట స్వపరాగ సంపర్కం లక్షణం కలిగిఉంటోంది.
 
మిరపకాయలను మొట్టమొదటగా గుర్తించిన వారిలో [[క్రిస్టోఫర్ కొలంబస్]] కూడా ఒకరు. ఆయన వీటిని (కరీబియన్‌లో కనుగొన్నారు), కనుగొన్న సమయంలో "పెప్పర్స్" అని సంబోధించారు. ఇతర ఆహారపదార్థాల మాదిరిగా కాకుండా కారంగా ఘాటైన రుచితో యూరోప్‌లో అప్పటికే సుపరిచితమైన ''పిపెర్'' తరగతికి చెందిన నలుపు మరియు తెలుపు పెప్పర్ (మిరియాలు) వలే ఉండడమే అందుకు కారణం. దీనితర్వాత యూరోప్‌లో పరిచయమైన మిరపకాయలు స్పానిష్ మరియు పోర్చుగీసు మఠాలకు చెందిన తోటల్లో ఔషధపరమైన మొక్కలుగా పెంచబడేవి. అయితే, సదరు మఠాల్లో ఉండే సన్యాసులు ఈ మిరపకాయలను వంట సంబంధిత అంశాల్లో ప్రయోగించి చూడడంతో పాటు మిరపకాయల్లో ఉండే కారం అనే గుణం నల్ల మిరియాల ఉపయోగానికి ప్రత్యామ్నాయంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించారు. ఎందుకంటే, ఆరోజుల్లో ఈ నల్ల మిరియాలనేవి అత్యంత ఖరీదైనవిగా ఉండేవి. ఈ కారణంగా అప్పట్లో కొన్ని దేశాల్లో వీటిని చట్టబద్దమైన ద్రవ్యంగా కూడా వినియోగించేవారు.<ref>ది నిబ్బిల్ ఆన్ లైన్ స్పెషాలిటి ఫుడ్ మాగజైన్ చిల్లి పెప్పర్ గ్లోస్సరి. ఆగష్టు 2008 http://www.thenibble.com/reviews/main/salts/scoville.asp. నుండి లభ్యం 31 ఆగస్ట్ 2010 న గ్రహింపబడినది.</ref>
"https://te.wikipedia.org/wiki/మిరపకాయ" నుండి వెలికితీశారు