ఉత్తర రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
 
===జానకీదేవి కళంక రహిత===
[[The reunited family, in a formal portrait (bazaar art, c.1910's).jpg|thumb|left|మళ్ళీ కలసిన సీతా రాములు]]
రాముడు సరే అని అంగీకరిస్తాడు. ఆయన కోరికమేరకు వారు ప్రతిరోజూ రామాయణాన్ని గానం చేసారు. అది విని రాముడు వీరు సీతాపుత్రులే అని గ్రహించాడు. దూతలను వెంటనే పిలిచి "మీరు వాల్మీకి మహాముని వద్దకు వెళ్ళి. నామాటలుగా ఇలా చెప్పండి. మహర్షీ రాముడు నమస్కరించి మీకు విన్నవిస్తున్నదేమంటే మీ కావ్యం విన్నాను. అతి రమ్యంగా ఉన్నది. మీరు నిజంగా జానకీ దేవి కళంక రహిత అనిభావిస్తే ఆమెను సభాముఖానికి తీసుకొనివచ్చి ఆవిషయం ఆమెను నిరూపించుకోవాలి అని చెప్పగా వారు వాల్మీకిని కలసి తిరిగి వచ్చి" రేపు సీత తన నిర్దోషిత్వావ్వి ప్రకటిస్తుంది. కాబట్టి ఆమెపై అభాండాలు వేసిన వారుకూడా సభకు రావచ్చునని వాల్మీకి సెలవిచ్చారని చెప్తారు. రాముడు సభనుద్దేశించి "రేపు సీత తన నిర్దోషిత్వాన్ని ప్రకటిస్తుంది. మీరు తప్పక రావాలి" అని చెబుతాడు. ఆయన ప్రకటన విన్న వాళ్ళందరూ "ఇటువంటి ధర్మ పాలన నీకే చెల్లుతుంది" అని మెచ్చుకొంటారు. సభలోకి రాగానే శ్రీరాముడి తో పాటు సభాసదులందరూ వినయంగ లేచి నిలబడి మునీశ్వరుల అనుమతితో తిరిగి ఆసీనులయ్యారు. ముగ్ద సౌందర్యమూర్తి అయిన జానకీ దేవిని చాలా కాలం తరువాత చూసిన జనులు కన్నుల నీరుడుకున్నారు. అప్పుడు హృదయభారభరితమైన మౌనాన్ని చేదిస్తూ మేఘ గంభీర స్వరంతో వాల్మీకి ఇలా అన్నారు" సభికులారా! ఈమె పరమసాధ్వి జానకీ దేవి. దశరధుని కోడలు. శ్రీరామచంద్రుని ఇల్లాలు. ఈమెను శ్రీరామ చంద్రుడు లోక నిందకు భయపడి పరిత్యజించినాడు. నేను చెప్పునది సత్యము. ఇందులో ఏమైన అనృతమున్నట్టయితే ఇన్ని వేల సంవత్సరాల నా [[తపస్సు]] నిర్వీర్యమై పోగలదు"
 
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_రామాయణం" నుండి వెలికితీశారు