యుద్ధకాండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
===సాగరంపై వారధి===
[[File:Building a Bridge to Sri Lanka.jpg|thumb|సముద్రంపై వంతెనను నిర్మిస్తున్న వానరులు]]
[[బొమ్మ:Rama-Varuna.jpg|ఎడమ|thumb|150px|సముద్రంపై బాణం ఎక్కుపెట్టిన రాముడు ([[రాజా రవివర్మ]] చిత్రం)]]
తమ మధ్య వైరం ఏమీ లేదు గనుక రామునికి సాయం చేయవద్దని రావణుడు సుగ్రీవునికి శుకుడనే దూత ద్వారా దౌత్యం పంపాడు. అందుకు సుగ్రీవుడు - "రావణా! నాకు నువ్వు చేసిన సాయం లేదుగనుక నాకు ప్రియుడవు కావు. రామునికి విరోధివి గనుక నాకు కూడా విరోధివే. రాముని కోపానికి గురైనందున నిన్ను రక్షించే శక్తి ముల్లోకాలలోనూ లేదు" అని సమాధానం పంపాడు. సముద్ర తరణానికి మార్గం ఏమిటని హనుమంతుడు, సుగ్రీవుడు విభీషణుని అడిగారు. రాముడు సముద్రుని సాయం కోసం అర్ధించాలని విభీషణుడు సలహా ఇచ్చాడు. సముద్రుని సహాయం కోరి రాముడు మూడు రాత్రులు నియమంగా దీక్ష వహించినా సముద్రుడు ప్రత్యక్షం కాలేదు. కోపించి రాముడు సముద్రాన్ని ఎండగట్టేస్తానని ధనుస్సు ఎక్కుపెట్టాడు. సముద్రుడు వచ్చి, వినయంగా నమస్కరించి, తన స్వభావాన్ని త్యజింపలేనని మనవి చేశాడు. విశ్వకర్మ కొడుకైన నలుని ప్రజ్ఞతో వారధిని నిర్మింపవచ్చునని తెలిపాడు. సముద్రుని కోరికపై రాముడు తన అస్త్రాన్ని ద్రుమకుల్యంలోని దస్యులపై విడిచిపెట్టాడు.
 
[[File:Building a Bridge to Sri Lanka.jpg|thumb|సముద్రంపై వంతెనను నిర్మిస్తున్న వానరులు]]
 
ఇక సాగరమును దాటుటకు అద్భుతమైన వారధి నిర్మాణము నలుని పర్యవేక్షణలో ప్రారంభమైనది. మొదటి రోజు 14 ఆమడలు, రెండవ రోజు 20 ఆమడలు, మూడవ రోజు 21 ఆమడలు, నాలుగవ రోజు 22 ఆమడలు, ఆయిదవరోజు 23 ఆమడలు - ఇలా అయిదు దినములలో 100 యోజనముల పొడవు, 10 యోజనముల వెడల్పు గల వారధి నిర్మించారు. విభీషణుడు ఒక ప్రక్క వారధికి రక్షణగా నిలిచాడు. వానర భల్లూకసేనల, రామలక్ష్మణులు వారధి దాటి లంకను చేరారు. నీలుని నాయకత్వంలో ఆ సేన మరో సాగరంలా ఉండి, రామకార్యానికి సన్నద్ధమై ఉన్నది. దుంపలు, ఫలాలు, జలం పుష్కలంగా ఉన్నచోట విడిది చేశారు.
 
"https://te.wikipedia.org/wiki/యుద్ధకాండ" నుండి వెలికితీశారు