"యుద్ధకాండ" కూర్పుల మధ్య తేడాలు

381 bytes removed ,  9 సంవత్సరాల క్రితం
 
===కుంభకర్ణుని మరణం===
 
[[Image:Kumbhakarna battles the monkeys Asian Art Museum SF B66S7 n1.JPG|thumb|250px|ఎడమ|కుంభకర్ణుడిని నిలువరించడానికి ప్రయత్నిస్తున్న వానరసేన (థాయిలాండ్ లేదా కంబోడియా శిల్పం 1100 - 1200 మధ్య కాలం)]]
 
అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిదురలేపమని మంత్రులను పంపాడు. భేరీ భాంకారాలు చేసి, శూలాలతో పొడిచి, ముసలాలతో మోది, ఏనుగులతో త్రొక్కించి, ఏనుగులతో త్రొక్కించి వారు కుంభకర్ణుని నిదురనుండి లేపారు. లేవగానే [[కుంభకర్ణుడు]] మాంసరాసులను సుష్ఠుగా తిని, కుండలతో రక్తం త్రాగి, త్రేవ్చాడు. విషయం తెలుసుకొని, స్నానం చేసి, సర్వాభరణాలు ధరించి, బలకరమైన మద్యం భాండాలతో త్రాగి రావణుని చెంతకు వెళ్ళాడు. అతను నగరంలో నడుస్తుంటేనే భయంతో వానరసేనలు కకావికలమయ్యాయి. అంత వీరుడు రాక్షసులలో మరొకరు లేరని విభీషణుడు చెప్పాడు. అది ఒక యంత్రమని, రాక్షసుడు కాదని, వారు చెప్పి వానర సేనను స్థిమిత పరచారు.
రావణుడు కుంభకర్ణుడికి జరిగిన విషయం వివరించాడు. అనాలోచితంగా రావణుడు చేసిన చెడ్డపనులను సోదర ప్రేమతో నిందించాడు కుంభకర్ణుడు. కపటంతో సీతను మోసపుచ్చాలన్న మహోదరుని సూచన కూడా కుంభకర్ణునికి రుచించలేదు. తాను రామలక్ష్మణులను, సకల వానర సేనను భక్షించి పరిస్థితిని చక్కదిదద్దుతానని, రావణుడికి మాట యిచ్చి, అగ్నిలా వెలిగిపోతూ, కాలపాశ సదృశమైన పరిఘను పట్టుకొని, కోట గోడను ఒక్క అడుగులో దాటి యుద్ధానికి బయలుదేరాడు. ఆరు వందల ధనువుల యెత్తూ, వంద అడుగుల కైవారం ఉన్న ఆ మహాకాయుని చూస్తూనే వానర సేనలు పారిపోసాగాయి. ధైర్యం చెప్పి వారిని అతికష్టంమీద అంగదుడు నిలువరించాడు.
 
[[బొమ్మ:Kumbhakarna in war.jpg|thumb|150px|రామాయణ యుద్ధములో కుంభకర్ణునిపై బాణాలు ఎక్కుపెట్టిన రామలక్ష్మణులు (బాలాసాహెబ్ పండిత్ పంత్ ప్రతినిధి చిత్రం, 1916)]]
కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. అంగదుడు, ఋషభుడు, శరభుడు, మైందుడు, నీలుడు వంటివారు విసిరిన కొండలు కుంభకర్ణుని వంటికి తగిలి పొడి అయిపోయాయి. వందలాది వానరులను వాడు కరకర నమిలి మ్రింగ సాగాడు. హనుమంతుని దెబ్బకు కుంభకర్ణుడు రక్తం కక్కాడు. కుంభకర్ణుడి శూలం పోటుకు హనుమంతుడు రక్తం కక్కాడు. ఆ రాక్షసునికి ఎదురు పడిన అంగదాది వీరులు వాడి విదిలింపులకే సృహ తప్పి పడిపోయారు. సుగ్రీవుడు కుంభకర్ణుడి శూలాన్ని తన మోకాటికి అడ్డంగా పెట్టుకొని విరిచేశాడు. అప్పుడు కుంభకర్ణుడు విసిరిన పర్వత శిఖరం తగిలి సుగ్రీవుడు తెలివి తప్పాడు. మూర్ఛపోయిన సుగ్రీవుడిని పట్టుకొని లంకవైపు వెళ్ళాడు కుంభకర్ణుడు. తెలివి తెచ్చుకొన్న సుగ్రీవుడు ఒక్కసారి విదిలించుకొని, రాక్షసుని ముక్కు, చెవులు కొరికివేసి ఒక్కగెంతులో వానర సైన్యం మధ్యకు వచ్చిపడ్డాడు.
 
2,168

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/701300" నుండి వెలికితీశారు