యుద్ధకాండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 161:
 
===ఇంద్రజిత్తు మరణం===
[[File:Killing of Indrajit Painting by Balasaheb Pant Pratinidhi.jpg|thumb|ఎడమ|ఇంద్రజిత్తును చంపుతున్న లక్ష్మణుడు]]
కుంభ నికుంభులు, మకరాక్షుడు కూలిపోయారని వినగానే రావణుని శోక రోష భయాలు ముప్పిరిగొన్నాయి. ఆ నరవానరులను చంపివేసి తన మనస్తాపాన్ని తీర్చవలసిందిగా ఇంద్రజిత్తును ఆశీర్వదించి యుద్ధరంగానికి పంపాడు. హోమం చేసి, శస్త్రాస్త్రాలు ధరించి యుద్ధరంగానికి వచ్చి అదృశ్యరూపంలో వానరసేనను, రామలక్ష్మణులను కలచివేయసాగాడు. లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం వేయాలంటే రాముడు అతనిని వారించాడు. ఇంతలో దృశ్యరూపుడై మాయాసీత తలను అందరి యెదుటా తెగనరికాడు. అది చూసి అంతా శోకంలో మునిగిపోయారు. రావణుని తత్వం తెలిసిన విభీషణుడు అది కేవలం మాయ అని వారికి నచ్చచెప్పాడు. ఇంద్రజిత్తు నికుంభిలా యాగం చేయడానికి వెళ్ళాడు. అతని చుట్టూ రాక్షసులు వ్యూహం తీరి కవచంలా ఉన్నారు.
 
"https://te.wikipedia.org/wiki/యుద్ధకాండ" నుండి వెలికితీశారు