యుద్ధకాండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 185:
 
===రావణ సంహారం===
[[File:Killing of Rawana Painting by Balasaheb Pant Pratinidhi.jpg|thumb|ఎడమ|రావణపోరాడుతున్న సంహారంరామ రావణులు]]
అదే సమయంలో ఇంద్రుడు పంపగా [[మాతలి]] దివ్యమైన రధంతో సారధిగా వచ్చాడు. అగ్ని సమానమైన కవచం, ఐంద్రచాపం, సూర్య సంకాశాలైన శరాలు, తీక్ష్ణమైన శక్తి కూడా ఆ రధంలో ఉన్నాయి. రాముడు సంతోషించి ప్రదక్షిణం చేసి రధం యెక్కాడు. రావణుడు వజ్రసదృశమైన శూలాన్ని చేతబట్టి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. రావణుడు విసిరేసిన శూలం ఎదురుపడి రాముని బాణాలు కాలిపోయాయి. అప్పుడు రాముడు మాతలి తెచ్చిన ఇంద్రశక్తిని విసిరేశాడు. అది రావణుని శూలాన్ని నిర్మూలించింది. రావణుడు కూడా శరపరంపరతో రాముని ముంచెత్తాడు. రాముడు విడచిన తీవ్ర బాణాలతో రావణుడి శరీరం రక్తసిక్తమయ్యింది. చివరకు అస్త్రవిహీనుడైన రావణుని పరిస్థితి గమనించి అతని సారధి రధాన్ని దూరంగా తీసుకుపోయాడు.
 
"https://te.wikipedia.org/wiki/యుద్ధకాండ" నుండి వెలికితీశారు