యుద్ధకాండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
 
 
[[దస్త్రం:F1907.271.194.jpg|thumb|సువేల పర్వతముపై రామునితో సమావేశమైన వానరులు]]
 
కాటుక కొండలలాంటి లెక్కలేనన్ని భల్లూకాలతో నర్మదా నదీతీరపు ఋక్షవంతం నుండి వచ్చిన నాయకుడు ధూమ్రుడు చాలా భయంకరుడు. ధూమ్రుని తమ్ముడు జాంబవంతుడు దేవాసుర యుద్ధంలో దేవేంద్రునకు సాయపడ్డాడు. వానర యోధులలో ప్రఖ్యాతుడు దంభుడు చాలా బలశాలి. కొండలాంటి రూపం కలిగిన వానర పితామహుడు సంనాదుడు కలియబడితే ఒకసారి దేవేంద్రుడే తగ్గిపోయాడు. పదికోట్ల వీరులతో హిమవద్గిరినుండి వచ్చిన క్రధనుడు పరాజయం ఎరుగనివాడు. ఏనుగులను దండించడం వినోదంగా భావించే ప్రమాధి, అతని అనుచరులు లంకపై పడడానికి ఉవ్విళ్ళురుతున్నారు. గవాక్షునివెంట ఇంకా కోట్లకొలది వానరులు సేతువును దాటి వస్తూనే ఉన్నారు. మేరుపర్వతం నుండి వచ్చిన వానరుల అధిపతి కేసరి. కాలసర్పాలలా ఘోర భీకరమైన వానరుల నాయకుడు శతబలి కాంచనపర్వత ప్రాంతంనుండి వచ్చాడు. గజుడు, గవాక్షుడు, గవయుడు, నలుడు, నీలుడు - వీరి వద్దనున్న వానరుల సంఖ్యాబలం చెప్పనలవి కానిది. సుగ్రీవుని ఆజ్ఞను జవదాటని వానరవీరులు మహా బలవంతులు, దుర్జయులు, కామరూపులు. మైందుడు, ద్వివిదుడు అనే సోదరులు బ్రహ్మ దేవుని అనుగ్రహం సంపాదించి అమృతపానం చేశారు. సుముఖుడు, దుర్ధరుడు అనే సోదరులు మృత్యుదేవత కొడుకులు.
 
"https://te.wikipedia.org/wiki/యుద్ధకాండ" నుండి వెలికితీశారు