"యుద్ధకాండ" కూర్పుల మధ్య తేడాలు

 
===నాగపాశ విమోచన===
[[దస్త్రం:2006AJ6361.jpg|thumb|left|300px|రామ లక్ష్మణులపై నాగాస్త్రమును ప్రయోగిస్తున్న ఇంద్రజిత్తు]]
అంగదుని చేత పరాభవం పొందిన [[ఇంద్రజిత్తు]] ఒక్కసారిగా మాయమైపోయాడు. మాయాయుద్ధమారంభించి నాగాస్త్రంతో రామలక్ష్మణులను వివశులను చేసి శతృసైన్యాన్ని భయకంపితులను చేశాడు. రామలక్ష్మణుల దేహంపై ప్రతి అంగుళం బాణాలతో నిండిపోయింది. వానరసేన సిగ్గువిడిచి పరుగులు తీసింది. అందరు వానర సైన్యాధిపతులూ ఇంద్రజిత్తు బాణాలతో గాయపడినవారే. ఆ నాగాస్త్ర బంధాలనుండి తప్పుకోవడం ఎవరివల్లా కాదని విజయ గర్వంతో ఇంద్రజిత్తు తండ్రివద్దకు వెళ్ళి తాను రామలక్ష్మణులను చంపి వానరసేనను నిర్వీర్యం చేసేశానని చెప్పాడు. రావణుడు ఆనందించి, ఆ రాఘవుల మృతదేహాలను సీతకు చూపమని ఆదేశించాడు. [[పుష్పకం]]పై సీతను తెచ్చి ఆ దృశ్యం చూపగా ఆమె విలపించ సాగింది. రామలక్ష్మణులు కేవలం వివశులయ్యారని, త్వరలో కోలుకొంటారని చెప్పి, [[త్రిజట]] సీతను ఊరడించింది.
 
2,168

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/701443" నుండి వెలికితీశారు