కిష్కింధకాండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 85:
 
===శ్రీరాముని వేదన===
[[దస్త్రం:DP153185.jpg|thumb|left|పవరాసన పర్వతముపై రామ లక్ష్మణుడు]]
వర్షఋతువులో అన్వేషణా యత్నం సాధ్యం కాదు గనుక నాలుగు మాసాలపాటు కిష్కింధలో సుఖభోగాలు అనుభవించమని, కార్తిక మాసం రాగానే రావణ వధకు సిద్ధం కావాలని రాముడు సుగ్రీవునకు చెప్పాడు. రామ లక్ష్మణులు ధాతు సంపన్నమైన ప్రస్రవణ పర్వతంపై నివశించసాగారు. ఆ రమణీయ ప్రదేశం వర్షాకాలంలో మరింత సుందరంగా ఉంది. అందువలన రాముడు మరింతగా సీతాస్మరణంతో రోదించ సాగాడు. దుఃఖించేవాడికి సర్వ కార్యాలు చెడుతాయని, ఒక్క నాలుగు నెలలాగితే కార్యసాధన సానుకూలమౌతుందని లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు. అందుకు సాంత్వన పొందిన రాముడు తాను విచారాన్ని విడచిపెట్టి పరాక్రమాన్నే అవలంబిస్తానని, శత్రు వధకు సన్నద్ధమౌతానని మాట ఇచ్చాడు.
 
 
===సుగ్రీవుని పట్ల లక్ష్మణుని ఆగ్రహం===
"https://te.wikipedia.org/wiki/కిష్కింధకాండ" నుండి వెలికితీశారు