ఉత్తర రామాయణం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
 
===రామాయణ గానం===
[[దస్త్రం:F1907.271.14.jpg|thumb|రాముని సభలో రామాయణమును గానము చేయుచున్న లవ కుశులు]]
మరునాటి ఉదయం లవకుశులు వాల్మీకి మునికి నమస్కారం చేసి, ఆయన ఆశీర్వాదంతో రామాయణ గానం అయోధ్య నలుదెసలా ఆరంభిస్తారు. ఆ గానామృత మాధుర్యానికి జనులు సమ్మోహితులై వారిని వెంబడిస్తారు. దేశం నలుమూలలా కుశలవుల గాన మాధుర్యం గురించే చర్చ జరుగుతూంది. రాముడు కూడా ఆ గానాన్ని విని ముగ్దుదౌతాడు. యజ్ఞకర్మ పూర్తి కాగానే ఒక సభను ఏర్పాటు చేసి మునులు, రాజులు, పండితులు, సంగీత విద్వాంసులు, భాషావేత్తలు, వేదకోవిదులు, సకలవిద్యాపారంగతులు ఆసీనులై ఉన్న సమయాన రాముడు కుశలవులను తమ గాన మాధుర్యాన్ని వినిపించమని కోరతాడు. మొదటి సర్గనుంచి ఇరవై సర్గలు వరకూ వారు అతి రమ్యగా గానంచేయగా సభాసదులు చప్పట్లు చరిచి వారి గాన మాధుర్యానికి జేజేలు చెప్తారు. రాముడు భరతునితో ఈ బాలురకు పద్దెనిమిదివేల బంగారు నాణేలు బహూకరించమని కోరగా లవకుశులు తమకు ఎలాణ్టి ధనమూ కానుకలూ అవసరం లేదని తిరస్కరిస్తారు. అప్పుడు రాముడు . మీరు పాడిన కావ్యం ఏమిటి? అని ప్రశ్నించగా లవకుశులు " దీని కర్త వాల్మీకి మహర్షి. ఇప్పుడాయన ఇక్కడే ఉన్నారు. ఆయనే మాగురువు. మీ చరిత్రనే ఆయన ఇరవై నాలుగువేల శ్లోకాలుగా వ్రాసాడు. దీనిలో 7 కాండాలున్నాయి. అయిదువందల సర్గలున్నాయి. వంద కధలున్నాయి. మీకంతగా కోరిక ఉంటే పాడి వినిపిస్తాం" అన్నారు.
 
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_రామాయణం" నుండి వెలికితీశారు