సుందర కాండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
 
===త్రిజటాస్వప్నం===
[[ఫైలు:Sita at ashokavana.jpg|right|thumb|400px|అశోకవనంలో సీతను రావణుడు బెదిరించడం - 16వ శతాబ్దం నాటి చిత్రం]]
అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి సీతను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. సీత ఒక గడ్డిపరకను అడ్డముగా పెట్టుకొని, రావణుని ధర్మహీనతను, భీరత్వాన్ని నిందించింది. పోగాలము దాపురించినందువల్లనే ఈ నీచ సంకల్పము అతనికి కలిగిందని హెచ్చరించింది. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మమగుట తథ్యమని రావణునకు గట్టిగా చెప్పినది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నించ సాగారు. రావణునికి వశం కాకపోతే ఆమెను తినేస్తామని బెదరించారు. భయ విహ్వలయై, ఆశను కోల్పోయిన సీత ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకొన్నది.
[[ఫైలు:Sita at ashokavana.jpg|right|thumb|400px|అశోకవనంలో సీతను రావణుడు బెదిరించడం - 16వ శతాబ్దం నాటి చిత్రం]]
 
వారిలో సహృదయయైన [[త్రిజట]] అనే రాక్షసకాంత మిగిలిన రాక్షస స్త్రీలను గద్దించి, సీతవంటి పుణ్యస్త్రీకి హాని చేయడం రాక్షస జాతికి వినాశకరమని హెచ్చరించింది. తనకు వచ్చిన కలలో ఇలా జరిగిందని చెప్పింది -
 
"https://te.wikipedia.org/wiki/సుందర_కాండ" నుండి వెలికితీశారు