సుందర కాండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
 
===తిరుగు లంఘనం===
[[File:Hanuman's visit to Lanka.jpg|thumb|లంక నుండి తిరిగి వస్తున్న హనుమంతుడు]]]]
హనుమంతుడి పద ఘట్టనంతో అరిష్ట పర్వతం నేలలో క్రుంగిపోయింది. ఒక మహానౌక సముద్రాన్ని దాటినట్లుగా హనుమంతుడు సునాయాసంగా ఆకాశాన్ని దాటాడు. దారిలో మైనాక పర్వతాన్ని గౌరవంగా స్పృశించి, ఉత్తర సాగర తీరం సమీపించగానే పెద్దయెత్తున గర్జించాడు. ఆ కేక విని జాంబవంతాదులు ఇది హనుమంతుని విజయసూచక ధ్వానమని గ్రహించి హర్షంతో గంతులు వేయసాగారు. మేఘంలాగా హనుమంతుడు మహేంద్రగిరిపై దిగి గురువులకు, జాంబవంతాది వృద్ధులకు, యువరాజు [[అంగదుడు|అంగదునకు]] ప్రణామం చేశాడు. - "'''కనుగొంటిని సీతమ్మను.''' ఆమె రాక్షసుల బందీయై, రాముని కొరకు ఎదురు చూచుచు కృశించియున్నది. " అని హనుమంతుడు చెప్పాడు. "కనుగొంటిని" అన్న మాటలతో '''వానరు లందరూ పరమానందము పొందారు.''' అతనిని కౌగలించుకొని సంతోషంతో చిందులు వేశారు. తరువాత తన లంకా నగర సందర్శనా విశేషాలను అన్నింటినీ తన బృందంలోనివారికి వివరంగా చెప్పాడు హనుమంతుడు.
 
"https://te.wikipedia.org/wiki/సుందర_కాండ" నుండి వెలికితీశారు