మర్రి చెన్నారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి విరామచిహ్నాల మార్పులు, అచ్చుతప్పులు
పంక్తి 1:
'''మర్రి చెన్నారెడ్డి''' రెండు పర్యాయాలు [[ఆంధ్ర ప్రదేశ్]] ముఖ్యమంత్రి మరియు భారత జాతీయ [[కాంగ్రేసు పార్టీ]]కి చెందిన రాజకీయ నాయకుడు. ఈయన [[ఉత్తర ప్రదేశ్]], [[పంజాబ్]], [[రాజస్థాన్]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాలకు గవర్నరుగా కూడా పనిచేశాడు. చెన్నారెడ్డి [[జనవరి 13]], [[1919]]న ప్రస్తుత [[రంగారెడ్డి జిల్లా]], [[వికారాబాదు]] తాలూకాలోని [[సిర్పూరు]] గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి మర్రి లక్ష్మారెడ్డి. ఈయన 1941లో ఎం.బి.బి.ఎస్ డిగ్రీ పొందాడు. విద్యార్ధిగా ఉన్న రోజుల్లో ఆంధ్ర యువజన సమితి మరియు విధ్యార్ధివిద్యార్ధి కాంగ్రెసును స్థాపించాడు. ఇవే కాక అనేక విద్యార్ధి, యువత, విద్యా, అక్షరాస్యత మరియు సాంస్కృతిక సంస్థలలో చురుకుగా పాల్గొనేవాడు. ఈయన ఒక వారపత్రికకు రెండు సంవత్సరాల పాటు సంపాదకత్వము వహించాడు. అంతే కాక అనేక పత్రికలలో వ్యాసాలు కూడా ప్రచురించాడు. చెన్నారెడ్డి అప్పటి హైదరాబాదు రాష్ట్రములోని స్వాతంత్ర్యోద్యమములో పాల్గొన్నాడు. 1942లో [[ఆంధ్ర మహాసభ (తెలంగాణ)|ఆంధ్ర మహాసభ]] ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. [[1996]]లో చెన్నారెడ్డి మరణించాడు. ప్రస్తుతం చెన్నారెడ్డి సమాధి [[హైదరాబాదు]]లో ఇందిరా పార్కు ఆవరణలో ఉన్నది. తెలంగాణా కోసం ఓ పార్టీ పెట్టి అన్ని సీట్లు గెలిచి, ఆపార్టీని కాంగ్రెసులో విలీనం చేశాడు.
 
==ఇన్నయ్య చెప్పిన విశేషాలు==
*దేవర్స్ బాబా కాలు చెన్నారెడ్డి నెత్తిపై పెట్టి దీవించాడు. ఆయన ఉత్తర ప్రదేశ్ లో ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుండే బాబా. అక్కడ డా. చెన్నారెడ్డి గవర్నర్ గా చేశారు. ఆ ఫోటో సెక్యులరిస్ట్ ఇంగ్లీషు మాస పత్రికలో ముఖచిత్రంగా వేశారు. చెన్నారెడ్డి ఆగ్రహంతో ఊగిపోయి, ఆ పత్రికను చూపి విసిరికొట్టి, నా మీద నీకు ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేస్తావా అన్నాడు.{{fact}}
"https://te.wikipedia.org/wiki/మర్రి_చెన్నారెడ్డి" నుండి వెలికితీశారు