సీతాదేవి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
 
రావణుడు అక్కడికి వచ్చి తనకు లొంగిపొమ్మని సీతను బెదరించాడు. సీత ఒక గడ్డి పరకను అడ్డముగా పెట్టుకొని, రావణునితో "రావణా! నన్ను కాంక్షించడం నీకు తగనిపని. ఇది నీకు, నీ వంశానికి వినాశకారకం. సూర్యునకూ కాంతికీ లాగే రామునకూ నాకూ అవినాభావ సంబంధం ఉంది. నీవు పిరికివాడివి గనుక రాఘవులు ఆశ్రమంలో లేనప్పుడు నన్ను అపహరించి తెచ్చావు. రామలక్ష్మణుల బాణాలు నిన్నూ, లంకనూ నాశనం చేయడం తధ్యం. వారిని ఎవరూ అడ్డుకొనలేరు. రామునకు నన్ను సమర్పించి శరణు వేడడం ఒకటే నిన్ను రక్షింపగల మార్గం" అన్నది.
[[దస్త్రం:Lanka Dahan Hanuman.jpg|thumb|లంక నుండి తిరిగి వస్తున్న హనుమంతుడు]]
 
క్రుద్ధుడై రావణుడు ఒక నెల గడువుపెట్టి వెళ్ళిపోయాడు. మరణించవలెనని తలచిన సీతను ఓదార్చి [[త్రిజట]] తనకు వచ్చిన స్వప్నము గురించి చెప్పినది. ఆమెకు శుభములు కలుగునని, త్వరలో మంచి వార్త వినగలదని ఊరడించినది.
 
"https://te.wikipedia.org/wiki/సీతాదేవి" నుండి వెలికితీశారు