సిల్క్ రోడ్డు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
ఈ పట్టుదారి భారతదేశం, చైనా, ప్రాచీన ఈజిప్టు, పర్షియా, అరేబియా, ప్రాచీన రోమ్ లలో గొప్ప గొప్ప నాగరికతలకు దోహదపడటమే కాక ఆధునిక ప్రపంచ నిర్మాణానికి కూడా కారణమయ్యింది. చైనీయ పట్టు ఈ దారిన ప్రధాన వాణిజ్య వస్తువు అయినప్పటికీ, ఇతర వాణిజ్య వస్తువులు కూడా ఉన్నాయి. ఈ దారి గుండా ఎన్నో శాస్త్రవిజ్ఞాన ఆవిష్కరణలు, మతాలు, తత్త్వశాస్త్రాలు లతో బాటు ప్లేగు వంటి వ్యాధులు కూడా ప్రయాణించాయి. ఈ దారి గుండా చైనా ప్రధానంగా పట్టు, తేయాకు, పోర్సలీన్ ఎగుమతి చేసేది. భారతదేశం సుగంధద్రవ్యాలు, దంతాలు, మిరియాలు, నేతవస్త్రాలు, విలువైన రత్నాలూ ఎగుమతి చేసేది. రోమన్ సామ్రాజ్యం బంగారం, వెండి, ద్రాక్షరసం, తివాచీలు, నగలు ఎగుమతి చేసేది. పట్టుదారి పొడవునా పూర్తిగా ప్రయాణించినవారు చాలా తక్కువ. మధ్యలో ఎంతోమంది దళారీలు ఉండేవారు. ప్రాచీన భారతీయులు, బాక్టీరియనులు ప్రధాన వర్తకులుగా ఉండగా క్రీ.శ 5-8 శతాబ్దాలలో సోగ్దియనులు, ఆ తర్వాతకాలంలో అరేబియా, పర్షియా వర్తకులు ప్రధానంగా వర్తకం చేసేవారు.
 
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
 
[[af:Syroete]]
"https://te.wikipedia.org/wiki/సిల్క్_రోడ్డు" నుండి వెలికితీశారు