బలిపీఠం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
==కథా సంగ్రహం==
రామనాధం గారు బాల్య వితంతువు అయిన అరుణ విషయం భాస్కర్ వద్ద ఎత్తినప్పుడు తనకు తార తో వున్న స్నేహం గురించి చెప్పకుండా మిన్నకున్నందుకు భాస్కర్‌ని ఉతికి ఆరేస్తారు రంగనాయకమ్మ గారు. సాదారణంగా ఎవరైనా పెళ్లి విషయం మాట్లాడడానికి సిగ్గు పడతారు. అటువంటి మొహమాటంతోనె భాస్కర్ తార విషయం చెప్పడానికి ఇబ్బంది పడి వుండచ్చు అని నా అభిప్రాయం.అది కాకుండా నేడొ రేపొ కన్ను మూసే పరిస్థితిలో అరుణని పెళ్ళి చేసుకుని ఆవిడ కి మనస్శాంతి కి కారణమవదామనుకున్నట్టూ కూడా అనిపిస్తుంది.ఎలాగూ ఆవిడ చనిపోతె తారని పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏమి వుండదని భాస్కర్ అభిప్రాయం కూడా కావచ్చు.అయినా అరుణ తన అనారోగ్య కారణంగా భాస్కర్ సుఖ సంతోషాలకి లోటు జరగ వచ్చని,రెండో పెళ్లి చేసుకుంటే తనకి ఏమి అభ్యంతరం లేదు అని చెబుతుంది.నిజంగా తారని ఇష్టపడ్డవాడె అయితే ఆమెని కూడా చేసుకోవచ్చు కదా!బహుశా రెండు పెళ్లిల్లు చేసుకుంటే సమాజం లో తన ఇమేజి కి చేటు అని అలా చెయ్యలేదు అనిపిస్తుంది.అలా కాకుండా ముందు అరుణని పెళ్లి చేసుకుని ఆమె చనిపోతే మళ్లీ తారని చేసుకుంటె అటు తన సంస్కరణ కండూతి తీరుతుంది,తన మనసుకి నచ్చిన తార తో వివాహం కూడా జరుగుతుందని అనుకుని వుంటాడు.
 
ఆ విధంగా వర్ణాంతర వివాహం జరిగి భాస్కర్ అరుణ ఒకటవుతారు.కాని తన జాత్యాహకారం తో తన సంసారాన్ని అరుణ పాడు చేసుకుంటుంది.అయితే అరుణకి కనువిప్పు కలిగే విధంగా ఆవిడగారి కజిన్ సిస్టర్ అమల మతాంతర వివాహం చేసుకుని కూడా చక్కగా సంసారం సాగిస్తుంది.అమల వుద్యోగం మాని ఇంట పట్టున వుంటు అందరి మంచి చెడ్డ చూస్తు,వ్రతాలు నోములు చేసుకోవడం రంగనాయకమ్మ గారికి నచ్చలేదు.ఆర్ధిక స్వాతంత్రం ప్రతీ ఒక్కరికి అవసరమని చెబుతారు.ఒక సంధర్బంలో అరుణ అమలని “నువ్వు బొట్టు పెట్టుకోవడం మీ ఆయనకి ఇష్టం లేకపోతె ఏమి చేస్తావు”అని అడుగుతుంది.దానికి అమల ద్వారా చాల గొప్ప సమాధానం చెప్పిస్తున్నాను అనుకుని రంగనాయకమ్మ గారు ఇలా అనిపించినందుకు బాధపడ్డారు.”మానెస్తాను అక్కా!ఒకరికి ఒకరు అనుగుణంగా వుంటేనె కదా,సంసారం నడిచేది”.అనుగుణంగా వుండడం అంటే భర్త మతానికి భార్య మతం బానిస అవ్వడమా అని ప్రశ్నిస్తారు.బహుశా అమలకి తన మత విశ్వాసాల కంటె భర్త మీద వున్న ప్రేమానురాగాలు ఎక్కువ అని అనుకోవచ్చు కదా?ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మతాంతర,వర్ణాంతర వివాహం చేసుకునే ముందే ఇటువంటి విషయాలు ముందుగా మాట్లాడుకోవాలని ఆవిడ సూచిస్తారు.కాకపోతె నాకు ఒక అనుమానం.కమ్యూనుజం పై రంగ నాయకమ్మ గారి అభిప్రాయాలు మారినట్టె,మతం పైన వ్యక్తుల అభిప్రాయం మారవచ్చు కదా!పెళ్లికి ముందు మాట ఇచ్చినట్టు పెళ్లి తరువాత మాట నిలుపుకోవడం అవుతుందా?ఒక ఉదాహరణ.పెళ్లి అయిన జంటలో భర్తకి తాగుడో,పేకాటో లేక సిగరెట్లో అలవాటు అయ్యింది అనుకోండి,భార్య మానమని అడగడం,ఇంకా చెప్పాలంటె అతడి ఆరొగ్యం కోసం పోరు పెడితే ఇది “నా స్వవిషయం,ఇలా పోరు పెట్టడం నా స్వేచ్చకి భంగం కలిగించడమే!నీ పెత్తందారితనం కి నా నమస్కారం” అని అతడు విడిపోతానంటె ఎవరైనా సమర్ధిస్తారా? మతం కూడా ఒక మత్తు లాంటిదే కదా!దానిని మానమని ఒకరికి ఒకరు చెబితే అది మంచికే అని ఆలోచించాలా లేక ఇది నా వ్యక్తిగత స్వేచ్చకి సంబందించిన విషయం అని వాదనకి దిగాలా?నాకు తెలిసి కమ్యూనిష్టులు మతానికి వ్యతిరేకం కదా!మరి రంగ నాయకమ్మ గారి అబిప్రాయం ఏమయ్యి వుంటుంది?ముందుగానె చెప్పినట్టు ఈ ప్రశ్నలన్ని నాకు తెలియక అడుగుతున్నవే గాని,విమర్శిద్దామని కాదు,తెలిసిన వారు తెలియబరిస్తే సంతోషిస్తాను.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/బలిపీఠం_(సినిమా)" నుండి వెలికితీశారు