"ఇడ్లీ" కూర్పుల మధ్య తేడాలు

6 bytes added ,  8 సంవత్సరాల క్రితం
చి (115.184.130.113 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 701841 ను రద్దు చేసారు)
తెలుగులో ఇడ్లీలను ఇడ్డెనలు అంటారు. ప్రస్తుతము ఈ పేరు వాడకం తగ్గినది.
 
[[చైనా]] యాత్రికుడు [[హుయాన్ త్సాంగ్]] (7వ శతాబ్దము) రచనల వలన [[భారత దేశము]]లో ఆ కాలములో ఆవిరిపట్టే పాత్రలు లేవని తెలుస్తున్నది కానీ భారతీయులు మరుగుతున్న గిన్నెపై బట్టకప్పి ఆవిరిపట్టి ఉండవచ్చని భావిస్తారు. ఇండొనేషియన్లు అనేకరకాల పులియబెట్టే వంటకాలు వండేవారు అందులో ఇడ్లీకి పోలికలున్న కేడ్లీ అనే వంటకము కూడా ఉన్నది. 800 - 1200 మధ్య కాలములో [[ఇండోనేషియా]]కు హిందూ రాజులతో పాటు వెళ్లిన వంటవాళ్లు, పులియపెట్టే పద్ధతులు, అవిరిపెట్టే పద్ధతులు మరియు వాళ్ల వంటకము కేడ్లీని దక్షిణ భారతదేశానికి తెచ్చారని ఒక భావన కానీ ఖచ్చితముగా నిర్ధారించుటకు ఆధారములు లేవు.
 
ఇడ్లీ ఎక్కడి నుండి దిగుమతి అయినా భారతీయుల ప్రియమైన అల్పాహార వంటకాలలో ఒకటిగా విలసిల్లుతున్నది. భారతదేశపు [[పల్లె]] పల్లెలో ఇడ్లీ గురించి తెలియని వారు తక్కువ. ప్రతి హోటలు నందు మెనూలో తప్పక చేర్చు వంటకం ఇడ్లీ.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/705553" నుండి వెలికితీశారు