మదురై: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 93:
[[Image:Pongal madu.jpg|thumb|100px|left| పండుగ సంబరాలలో భాగంగా అలంకరించబడిన ఎద్దు ]]
సంక్రాంతి మరుసటి రోజు పశువుల పండుగ చేస్తారు. కొత్తపంట పండి ఇంటికి చేరిన తరువాత కృతజ్ఞతగా మరియు ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగలో వ్యవసాయానికి అధికంగా సాయంచేసే ఎద్దులకు కృతజ్ఞతా పూర్వకంగా ఈ పడుగ జరుపుకుంటారు. ఈ పండుగ రోజు ఎద్దులకు స్నానం చేయించి, కొమ్ములకు రంగులద్ది, పూసలు మరియు రంగు దారాలతో చేసిన ఆభరణాలు ధరింపజేసి ఎద్దులను పూజించి ఆరాధిస్తారు. కొన్ని గ్రామాలాలో ఎద్దులను వస్త్రాలతో కూడా అలంకరిస్తారు.
=== తెప్పోత్సవం ===
[[Image:31Madura Teppakulam.jpg|thumb|100px|right|మారియమ్మన్ తెప్పోఉత్సవం జరిపే ఆలయ కొలను]]
తమిళ తై మాసంలో పౌర్ణమి రోజు (జనవరి మాసంలో) తెప్పోత్సవం జరుపుతారు. చక్కగా అలంకరించబడిన మీనాక్షీ సుందరేశ్వరుల విగ్రహాలను ఊరేగింపుగా మారియమ్మన్ ఆలయ కొనేరు (తెప్ప కుళం)తీసుకు వచ్చి చక్కగా పూలతో విద్యుద్దీప తోరణములతో అలంకరించబడిన తెప్పమీద ఎక్కించి కోనేరులో తిప్పుతూ ఈ ఉత్సవం నిర్వహిస్తారు.
 
=== సాంతనకూడు ఉత్సవం ===
సంవత్సరంలో కొన్ని ప్రత్యేక దినాలలో సన్యాసులు అందరూ చేరిన సందర్భాలలో సాంతనకూడు ఉత్సవం జరుపుకుంటారు.
"https://te.wikipedia.org/wiki/మదురై" నుండి వెలికితీశారు