మదురై: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 44:
 
== భౌగోళికం ==
మదురై తమిళనాడు రాజధాని చెన్నై నగరానికి నైరుతీ దిశలో 498 కిలోమీటర్ల (309 మైళ్ళ ) దూరంలో ఉంది. తిరుచినాపల్లికి 161 కిలోమీటర్ల (100 మైళ్ళ ) దూరంలో ఉంది. కోయంబత్తూకు 367 కిలోమీటర్ల (228 మైళ్ళ ) దూరంలో ఉంది. కన్యాకుమారీకి ఉత్తరంగా 241 కిలోమీటర్ల ( 150 మైళ్ళ ) దూరంలో ఉంది. సముద్రమట్టానికి 101 అడుగుల ఎత్తులో ఉంది. చదరమైన భూభాగం కలిగి వైగైనదీ తీరంలో ఉపస్థితమై ఉంది. వైగైనది నగరం మద్యగా ప్రవహిస్తూ నగరాన్ని రెండు సమాన భాగాలుగా విభజించినట్లు ఉంటుందీ సుందర పవిత్ర చారిత్రాత్మక నగరం. నగరానికి వాయవ్యంలో సిరుమలై మరియు నాగమలై కొండలు ఉన్నాయి. మదురై నగరంలోపలి మరియు వెలుపలి భూములు పెరియార్ ఆనకట్ట నుండి లభిస్తున్న నీటి సాయంతో పుష్కలమైన పంటలను అందిస్తున్నాయి.
 
మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ మదురై నగర వైశాల్యం 147.99 కిలోమీటర్లు. నగరం తడి లేని వేడి వాతావరణం కలిగి ఉంది. నగరంలో నైరుతీ రుతుపవనాల కారణంగా అక్టోబర్-డిసెంబర్ మాసాలలో వర్షాలు కురుస్తుంటాయి. వేసవి ఉష్ణోగ్రత పగలు 40 ° సెంటీగ్రేడులు రాత్రి 26.3 ° సెంటీగ్రేడులు ఉంటాయి. అతి అరుదుగా 43 ° సెంటీగ్రేడులు ఉంటుంది. శీతాకాల వాతావరణం పగలు 29.6 ° సెంటీగ్రేడులు రాత్రి వేళ 18 ° సెంటీగ్రేడులు ఉంటుంది. సరాసరి వార్షిక వర్షపాతం 85 సెంటీ మీటర్లు ఉంటుంది. నగరం తిరుమంగలం, తిరుపరకున్రం, మేలూరు, అనైయూరు, అవనియపురం మునిసిపాలిటీల మద్య ఉపస్థితమై ఉంది.
== జనాభా ==
2001 జనభా గణాంకాలను అనుసరించి నగరపాలిత సంస్థగా విస్తరించిన మదురై నగర జనభా 12,30,015. నగశివార్లలో ఉన్న జనాభా జనాభాతో కలసి 14 లక్షలు. వీరిలో పురుషుల శాతం 50.53%, స్త్రీల శాతం 49.46%. నగ అక్షరాస్యత 77.6%. ఇది జాతీయ సరాసరి ఆదాయానికంటే అధికం. పురుషుల అక్షరాస్యత 82.2%, స్త్రీల అక్షరాస్యత 72.6%. జనాభాలో 6 సంవత్సరాలకంటే తక్కువ వయసుకలిగిన వారి శాతం 10.7%. స్త్రీ:పుషుల నిష్పత్తి 979:1000.
ఇది జాతీయ స్త్రీ:పురుష నిష్పత్తి అయిన 944:1000 కంటే కొంచెం అధికం. 2005లో నేరాల సంఖ్య 1,00,000 మందికి 283.2. జాతీయ నేరాల శాతం 1.1%. నేరాల పరంగా భారతదేశంలో 35 ప్రధాన నగరాలలో మదురై నగరానికి 19వ స్థానంలో ఉంది. 2001 లో నగర జనసాంద్రత 1 చదరపు కిలోమీటరుకు 17,100. మదురై తమిళ భాష ప్రత్యేక యాసను కలిగి ఉంటుంది. ఇది కాక నగరంలో సౌరాష్ట్రా, ఉర్దూ మరియు ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు.
"https://te.wikipedia.org/wiki/మదురై" నుండి వెలికితీశారు