శుక్రుడు జ్యోతిషం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
== పురాణాలలో శుక్రుడి గురించి ==
శ్రీకృష్ణుడు కుచేలుడికి అనుగ్రహించిన అపార ధన సంపత్తిని ఉశనుడు అపహరించబూనడంతో ఈశ్వరుడు ఆగ్రహించి శుక్రుడిని సంహరించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఉశనుడు తన తపశ్శక్తితో ఈశ్వరుడి ఉదరంలో ప్రవేశించి అతడిని స్తుతించసాగాడు. బోళాశంకరుడైన ఈశ్వరుడు ఉశనుడికి అభయం ఇచ్చి, శుక్ర శోణిత రూపంలో బయటకు పంపాడు. అప్పటి నుండి అతడికి శుక్రుడన్న పేరు సార్థకమయింది. చైత్ర శుద్ధ ఏకాదశి నాడు మఖ నక్షత్రంలో మన్మధ సంవత్సరంలో ఉశనుడు శుక్రుడిగా అవతరించాడు. శివుడు అతడి స్తుతికి మెచ్చి ధన్వీర్యాలకు అధిపతిగానూ, రాక్షసులకు గురువుగానూ చేసి గ్రహమండలంలో స్థానం కల్పించాడు. అసురుల గురువైన శుక్రుడు వారి అభ్యున్నతి కొరకు ఘోర తపస్సు చేసాడు. ఈశ్వరుడిని మెప్పించి మృతసంజీవనీ విద్యను సాధించాడు. శుక్రుడు సంపదలకు, మంత్రాలకు, రసాలకు, ఔషధులకు అధిపతి. అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన శుక్రుడు తన సంపదలను దానవ శిష్యులకు అప్పగించి తపోవనాలకు వెళ్ళాడు. వర్షాలపై ఆధిపత్యం వహిస్తూ అతివృష్టి, అనావృష్టికి కారకుడౌతాడు. వర్షాలను నిరోధించే వారిని శాంతింపచేస్తాడు.
== ద్వాదశ స్థానాలలో శుక్రుడు ==
* శుక్రుడు లగ్నంలో ఉన్న జాతకుడు ఆరోగ్యవంతుడు, సుందరశరీరం కలిగిన వాడు, సుఖజీవి, చిరంజీవి ఔతడు.
* శుక్రుడు ద్వితీయస్థానమున ఉన్న బహువిధములుగా సంపదలు కలవాడు, కవి ఔతాడు.
* తృతీయముస్థానమున శుకృడు ఉన్న జాతకుడు భార్యాహీనుడు, కష్టవంతుడు, బీదవాడు, దుఃఖవంతుడు, అపకీత్రి కలవాడు ఔతాడు.
* చతుర్ధస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు వానములు కలవాడు, మంచిగృహం కలవాడు, నగలు, వస్త్రములు, సుగంధద్రవ్యములు కలవాడు ఔతాడు.
* పంచమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు అపారధనవంతుడు, ఇతరులను రక్షించు వాడు, బహుమేధావి, పుత్రులు కలవాడు ఔతాడు.
* షష్టమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు శతృవులు లేని వాడు, ధనమును లేని వాడు, యువతుల చేత వంచింపబడిన వాడు, విచారగ్రస్తుడు ఔతాడు.
* సప్తమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు మంచి కళత్రం ఉన్న వాడు, పరస్త్రీ ఆసక్తుడు, కళత్రం లేని వాడు, ధనవంతుడు ఔతాడు.
* అష్టమ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు చిరంజీవి, ధనవంతుడు, రాజు ఔతాడు.
* నవమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు భార్యాబిడ్డలు, సంతానం, ఆప్తులు కలిగి రాజాశ్రయం కలిగి అభివృద్ధి చెందుతూ ఉంటాడు.
* దశమస్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగినవాడు, మిత్రులు కలిగిన వాడు, ప్రభువు ఔతాడు.
* ఏకాదశ స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు పరస్త్రీ లోలుడు, బహు సుఖవంతుడు ఔతాడు.
* ద్వాదశము స్థానమున శుక్రుడు ఉన్న జాతకుడు దేవతలతో సమానమైన సౌఖ్యవంతుడు, ధనవంతుడూ ఔతాడు.
== వెలుపలి లింకులు ==
 
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/శుక్రుడు_జ్యోతిషం" నుండి వెలికితీశారు