శని (జ్యోతిషం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
శని దశా ప్రారంభ సమయం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలిననాటి శని కాలం శని సమస్యలను ఇచ్చే సమయం. శివారాధన,శివార్చన, శివాలయ దర్శనం సమస్యలకు పరిస్కారంగా చేయాలి. శని క్షేత్రాలయిన తిరునల్లారు, శని సింగినాపురం లాంటి క్షేత్ర దర్శనం. శ్రీకూర్మ దేవాలయ దర్శనం చేయాలి. శని దశాకాలం పందొమ్మిది సంవత్సరాలు కనుక పంతొమ్మిదివేల సార్లు జపం చేయించాలి. నువ్వులు, మినుములు, నూనెలను దానం ఇవ్వాలి. నల్ల వస్త్రాలు ధరించి శని గాయత్రి, శని శ్లోకం లాంటివి పారాయణం చేయాలి. అయ్యప్ప జయంతి, శనీశ్వర వ్రతం, సత్యనారాయణ వ్రతం, అయ్యప్పస్వామి పూజ చేయాలి. కూర్మపురాణ పారాయణం, వేంఖటేశ్వర శతనామావళి, శని అష్టోత్తరం చేయాలి.ఆంజనేయుడిని పూజించి దర్శించుట. పూజకు ఇనుముతో చేసిన ప్రతిమను వాడాలి. నైవేద్యం నువ్వులతో కలిపిన అన్నం, నువ్వు చిమ్మిరి, నువ్వు ఉండలు, ద్రాక్షరసం వాడాలి. కపిల గోవు దానం చేయాలి. శనికి ప్రీతికరమైన జ్యేష్టశుద్ధ ద్వాదశి, మార్గశిర శుద్ధ అష్టమి నాడు పూజలు జపాలు నిర్వహించడం శ్రేష్టం. దోషనివారణకు నీలమణి, ఎర్రచందన మాల, చతుర్దశ ముఖ రుద్రాక్ష ధారణ చేయాలి. హోమముకు వాడవలసిన సమిధ జమ్మి. ప్రీతికరమైన వారం శనివారం.
== ద్వాదశ స్థానములలో శని ==
* లగ్నంలో శని ఉన్న జాతకుడు దు॰ఖపూరితుడు, నిస్సహాయుడు, మలినాంబరధారి, నీరసి అయి ఉంటాడు. అయినా శని స్వరాశులైన మకరం, కుంభం, ఉచ్ఛ స్థానమైన తుల రాశులు లగ్నమై వాటిలో శని ల్గ్నస్థుడై ఉంటే మాత్రం రాజతుల్యుడు, ప్రధాన పదవులు వహించే వాడు, నగరపాలకుడు ఔతాడు.
* ద్వితీయస్థానమున శని ఉన్న జాతకుడు జుగుస్సు కలిగించే ముఖం కలవాడు, ధనహీనుడు, అన్యాయవర్తనుడు, కాలక్రమమున దూరప్రాంతములణందు నివసించు వాడు ధనవంతుడు ఔతాడు.
* తృతీయస్థానమున శని ఉన్న జాతకుడు మిక్కిలి విజ్ఞానవంతుడు, ఉదారుడు, భార్యాసమేతంగా సుఖపడువాడు, ఉత్సాహి, దుఃఖం లేని వాడు ఔతాడు.
* చతుర్ధస్థానమున శని ఉన్న జాతకుడు సుఖహీనుడు, గృహము లేని వాడు, వాహనములు లేని వాడు, బలారిష్టములు అనుభవించు వాడు, తల్లిని పీడించువాడు ఔతాడు.
* పంచమస్థానమున శని ఉన్న జాతకుడు, అజ్ఞాని, పుత్రులు లేని వాడు, ధనహీనుడు, సుఖహీనుడు, దురభిమాని, దురాలోచనాపరుడు ఔతాడు.
* షష్టము స్థానమున శని ఉన్న జాతకుడు ధనవంతుడు, అధికంగా ఆహారం తినువాడు, దుశ్చరిత్రుడు, అభిమానవంతుడు, శత్రువుల చేత ఓడింపబడిన వాడు ఔతాడు.
* సప్తమస్థానమున శని ఉన్న జాతకుడు తిరుగాడు వాడు, కళత్రం కలిగిన వాడు, భయకంపితుడు ఔతాడు.
* అష్టమ స్థానమున శని ఉన్న జాతకుడు శుభ్రం లేని వాడు, ధనం లేని వాడు, మూల వ్యాధి పీడితుడు, క్రూరమనస్కుడు, సజ్జనుల చేత అవమానించబడిన వాడు ఔతాడు.
* నవమస్థానమున శని ఉన్న జాతకుడు అదృష్టం లేని వాడు, సంపదలేని వాడు, సంతతి లేని వాడు, పితృధర్మం లేని వాడు, మోసకారి ఔతాడు.
దశమస్థానమున శని ఉన్న జాతకుడు రాజు కాని, మంత్రి కాని ఔతాడు. ధైర్యవంతుడు, ధనవంతుడు, ఖ్యాతి కలవాడు ఔతాడు.
* ఏకాదశ స్థానమున శని ఉన్న జాతకుడు చిరంజీవి, బహుసంపాదనాపరుడు, స్థిరసంపదలు కలిగిన వాడు, రోగములు లేని వాడు ఔతాడు.
* ద్వాదశ స్థానమున శని ఉన్న జాతకుడు నిర్లజ్జ కలవాడు, ధనం లేని వాడు, పుత్రులు లేని వాడు, అంగవికలుడు, మూర్ఖుడు, శత్రువులచేత తరమబడిన వాడు, పుత్రులు లేని వాడు ఔతాడు.
 
== వెలుపలి లింకులు ==
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/శని_(జ్యోతిషం)" నుండి వెలికితీశారు