మాతృగయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== చరిత్ర ==
ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్న సిద్ధపూరును మాతృగయ అంటారు. పురాతన కాలంలో ఈ ప్రదేశాన్ని స్త్రీస్థల్ అంటారు. ఋగ్వేదంలో ఈ ప్రదేశవర్ణన ప్రస్థావించబడింది. మహాముని ధదీచి ఇంద్రుడికి తన ఎముకలను దానంగా ఇచ్చిన ప్రదేశం ఇదే. మహాభారతంలో పాండవుల అరణ్యవాస సమయంలో పాండవులు ఈ ప్రదేశం సందర్శించినట్లు పురాణాలలో ప్రస్తావించబడింది. క్రీ.శ 4-5 శతాబ్ధంలో ఇరాన్ నుండి వలస వచ్చిన గుజరా ప్రజలు పెద్ద సంఖ్యలో స్థిరపడినట్లు చారిత్రకాధారాలు వివరిస్తున్నాయి. 10వ శతాబ్ధంలో సోలంకి చక్రవర్తుల పాలనలో ఈ ఊరు వైభవాన్ని సంతరించుకుంది. సిద్ధిరాజ్ జైసింగ్ తన పాలనా కాలంలో ఈ ఊరును నిర్మించి తన రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు. ఆయన ఇక్కడ శివాలయ నిర్మాణం, సుందర ప్రదేశాలు మరియు 80 మీటర్ల పొడవున్న పెద్ద గోపుర నిర్మాణం చేసాడు. ఆయన ఇక్కడకు [[మథుర]] నుండి పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులను తీసుకు వచ్చాడు. వారంతా ప్రతుతం ఇక్కడ స్థిరపడ్డారు. 12వ శతాబ్ధంలో మహమ్మద్ ఘోరీ నాయకత్వంలో ఈ ఊరు ధ్వంశం చేయబడింది. వారు సోమనాధ్ ఆలయానికి వెళ్ళే దారిలో దీనిని ధ్వంశం చేసారు. ఆ దండయాత్రలో 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతటితో సోలంకి సామ్రాజ్య పతనం జరిగింది. సుల్తానుల పాలనలో ఈ ఊరు ప్రాంతీయ పాలన్‌పూర్ రాజప్రతినిధి పాలనలో ఉంది.
తరువాత ఊఈ ప్రదేశం ముగల్ చక్రవర్తి [[అక్బర్]] పాలనలోకి వచ్చింది. ముగల్ పాలనలో ఈ ఊరు అభివృద్ధి చేయబడి సమృద్ధిని సాధించింది.
 
== బిందుసరోవరం ==
కర్ధమప్రజాపతి సరస్వతీ నదీతీరంలో అనుకూలవతి అయి మోక్షసాధనకు సహకరించ కలిగిన భార్యను అనుగ్రహించమని విష్ణుమూర్తి కొరకు తమస్సు చేసినప్పుడు ప్రక్షమైన విష్ణుమూర్తి కర్ధమ ప్రజాపతిని చూసి ఆనందభాష్పాలు రాల్చాడు. విష్ణుమూర్తి కంటి నుండి రాలిన కన్నీటి బిందువులే బిందుసరోవరంగా రూపుదిద్దుకొన్నది. హిందూమత ధర్మం అనుసరించి ఉన్న అయిదు పవిత్ర సరోవరాల్లో బిందుసరోఈవరం ఒకటి. మిగిలిన నాలుగు సరోవరాలు టిబెట్‌లోని మానస సరోవరం, రాజస్థాన్‌లోని [[పుష్కర్]] సరోవరం, గుజరాత్‌లోని బిందుసరోవరం, కర్నాటక రాష్ట్రం లేని హంపీలో ఉన్న పంపా సరోవరం. ఈ బిందు సరోవరం సమీపంలో కపిల మహర్షి ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసాడు. ఇది అతిపవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు. ఈ సరోవరాన్ని చుట్టి సరస్వతీ నది ప్రవహిస్తుంది. ఇక్కడ స్నానం చేసిన వారికి మోక్షం సిద్ధిస్తుందని విశ్వసిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం యాత్రికులు స్నానమాచరించడానికి తగిన నీరు లేవు కనుక ఇక్కడ నీటిని మాత్రం చల్లుకుని అనుమతి తీసుకుని వారి వారి తల్లికి మాత్రం శ్రాద్ధకర్మ నిర్వహిస్తారు.
"https://te.wikipedia.org/wiki/మాతృగయ" నుండి వెలికితీశారు