సూపర్ నోవా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
 
==వివిధ సూపర్ నోవాలు ఏర్పడే విధానం==
పైన వివరించిన వర్గీకరణ కేవలం వర్గీకరణ కోసం మాత్రమే. అవి వాటి నుంది వచ్చే కాంతిని వివరిస్తాయి కానీ అవి ఏ విధంగా ఏర్పడతాయో వివరించవు. వివిధ రకాల సూపర్ నోవాలు ఏర్పడటానికి గల కారణాలు కింద వివరించబడ్డాయి.
===వర్గం-1a===
 
ఈ సూపర్ నోవాలు అనేక రకాలుగా ఏర్పడవచ్చు. కాని వాటన్నింటికి మూలాధార ప్రక్రియ మాత్రం ఒక్కటే ఉంటుంది. ఒక కార్బన్-ఆక్సీజన్ మరుగుజ్జు నక్షత్రం చంద్రశేఖర్ పరిమితిని చేరుకోదగ్గ ద్రవ్యరాశిని (సూర్యుని ద్రవ్యరాశికి 1.38 రెట్లు) గ్రహించగలిగితే అది అంత ద్రవ్యరాశిని (ప్లాస్మా) ఎలక్ట్రాన్ వికర్షణ పీడనం ద్వారా నిలుపుకోలేక కుచించుకుపోతుంది. కనీ సాధారణంగా అవి ఆ పరిమితికి చేరుకోకముందే వాటి ఉష్ణొగ్రత, సాంద్రత పెరిగి నక్షత్రకేంద్రంలో కర్బన సంలీన మొదలవుతుంది. కొద్ది క్షణలలోనే చెప్పుకోదగ్గ పరిమాణంలో పదార్థం సంలీనానికిలోనై నక్షత్రం పూర్తిగా పేలిపోయి సూపర్నోవాగా మారటానికి కావల్సినంత శక్తి విడుదల అవుతుంది. నక్షత్రంలోని పదార్థం ఒక అలజడి తరంగంగా, సెకనుకి 5000-20,000కి.మీ. (కాంతివేగంలో సుమారు 3%) వేగంతో బయటకి విసిరివేయబడుతుంది. అప్పుడు దానినుండి సూర్యునికి 5 బిలియన్ రెట్ల కాంతి వెలువడుతుంది. ఆ కాంతి నిజపరిమాణం 19.3 ఉంటుంది.
సాధారణంగా ఇది దగ్గరగా ఉండే జంట నక్షత్రాలలో జరుగుతుంది. జంట నక్షత్రాలలో పెద్దది ముందుగా నక్షత్ర పరిణామ క్రమంలో మారుతూ రెడ్ జైంట్ గా మారుతుంది. రెడ్ జైంట్ గా మారిన నక్షత్రం పై పొరలు విస్తరిస్తూ ఉంతాయి. కొంత కలానికి రెడు నక్షత్రలకి ఒకే ఉమ్మడి పొర ఉంటుంది. దానివల్ల వాటి అక్ష పరిభ్రమణ వ్యాసార్థం తగ్గిపోతుంది.
రెడ్ జైంట్ దాని పై పొరలను పూర్తిగా కోల్పోయి కొంతకాలానికి కెంద్రక సంలీనానికి ఇంధనం మిగలదు. అప్పుడు అది కార్బన్, ఆక్సీజన్ ఎక్కువగా ఉన్న మరుగుజ్జు నక్షత్రంగా మారుతుంది. తర్వాత రెండవ నక్షత్రం కూడా పరిణామ క్రమంలో రెడ్ జైంట్ గా మారుతుంది. అప్పుడు రెండవ రెడ్ జైంట్ నుండి మరుగుజ్జు నక్షత్రం పద్దర్థాన్ని గ్రహించి దాని ద్రవ్యరాశిని పెంచుకుని, సూపర్నోవాగా మారుతుంది.
రెండు మరుగుజ్జు నక్షత్రాలు కలిసిపోవటం వల్ల వాటి ఉమ్మడి ద్రవ్యరాశి కొన్ని క్షణాల పాటు చంద్రశేఖర్ పరిమితిని దాటడంవల్ల కూడా వర్గం-1a సూపర్నోవాగా మారుతుంది.
సూపర్నోవా పేలుడు తర్వాత కాలంతో పాటు మారే నక్షత్ర ప్రకాశం సాధారణ కాంతి వక్రాన్ని పోలి ఉంటుంది. ఈ ప్రకాశం నికెల్-56 రేడియో ధార్మిక క్షీణత వల్ల కోబాల్ట్-56గా, దాని నుండి ఐరన్-56 గా మారినప్పుడు వెలువడుతుంది.
===వర్గం-1b,1c===
ఇవి టైప్-2 సూపర్నోవాలలాగా, చాలా పెద్ద నక్షత్రాలలో కేంద్రక సంలీనానికి కావలసిన ఇంధనం అయిపోయినప్పుదు ఏర్పడతాయి. కానీ టైప్-1b,1c సూపర్నోవాలలో నక్షత్రాలలోని బయటి హైడ్రోజన్ పొరను అంతరిక్ష గాలుల వల్ల కోల్పోతాయి. టైప్-1b సూపర్నోవాలు వొల్ఫ్-రేయెట్ నక్షత్రాలు పేలిపోవటం వల్ల ఏర్పడతాయని భావిస్తున్నారు.
 
==References==
"https://te.wikipedia.org/wiki/సూపర్_నోవా" నుండి వెలికితీశారు