సూపర్ నోవా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 150:
హైడ్రోజన్ కంటే భారమైన మూలకాలు ఏర్పడటానికి సూపర్నోవాలు ఒక ముఖ్య కారణం. ఈ మూలకాలు కేంద్రక సంలీనం ద్వారా ఐరన్-56, అంతకంటే తక్కువ భారం గల మూలకాలు, కేంద్రక సంయోగం ద్వారా ఐరన్ కంటే భారమైన మూలకాలను ఏర్పరుస్తాయి. సూపర్నోవా r-ప్రాసెస్ కి కూడా ఒక కారణం. అత్యధిక ఉష్ణొగ్రత, సాంద్రత, న్యూట్రాన్లు ఎక్కువగా ఉన్న పరిస్థితులలో కేంద్రక సంయోగం ద్వారా న్యూట్రాన్లు ఎక్కువగా ఉన్న అస్థిర పరమాణుకేంద్రకాలను ఏర్పరుస్తాయి. ఈ అస్థిర కేంద్రకాలు బీటా-కిరణ ఉద్గారం వల్ల స్థిరమైన కేంద్రకాలుగా మారతాయి. r-ప్రాసెస్ సాధారణంగా రెండవ వర్గం సూపర్నోవాలలో జరుగుతుంది. ఐరన్ తర్వాతి మూలకాలలో ప్లూటోనియం, యురేనియంతో సహా సగం మూలకాలను సృష్టిస్తుంది.<br\>
r-ప్రాసెస్ కాక ఇనుము కంటే భార మూలకాలను సృష్టించే మరో కారణం s-r-ప్రాసెస్. ఇది రెడ్ జైంట్లలో జరుగుతుంది. ఇది కాస్త నెమ్మదిగా మూలకాలను సృష్టిస్తుంది. కానీ ఇది సీసం కంటే భారమైన మూలకాలను సృష్టించలేదు.
 
===విశ్వ పరిణామక్రమంలో సూపర్నోవాల పాత్ర===
సూపర్నోవా పేలుడు తర్వాత ఒక సాంద్రమైన పదార్థం, వేగంగా వ్యాకొచించే అలజడి తరంగంలోని పదార్థం ఉంటాయి. ఈ వ్యాకోచించే చుట్టూ ఉండే అంతరిక్షంలోకి వ్యాకోచిస్తుంది. తర్వాత పదివేల సంవత్సరాలలో చల్లబడి చుట్టూ ఉన్న విశ్వంలో కలిసిపోతుంది.<br\>
బిగ్ బ్యాంగ్ నుండి హైడ్రోజన్, హీలియం, లీథియం ఏర్పడ్డయి. మిగిలిన భారమైన మూలకాలన్నీ నక్షత్రాలు, సూపర్నోవాల వల్ల ఏర్పడ్డాయి. సూపర్నోవాల తమ చుట్టూ ఉన్న విశ్వాన్ని భార మూలకాలతో సంపన్నం చేస్తాయి. వీటి నుండి ఏర్పడ్డ తర్వాతి తరం నక్షత్రాలు కేవలం హైడ్రోజన్, హీలియం మాత్రమేగాక ఇతర లోహాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. నక్షత్రంలో ఉన్న వివిధ రకాల మూలకాలు నక్షత్రం యొక్క జీవిత కాలాన్ని, గ్రహాలను కలిగి ఉండే అవకాశాన్ని నిర్దేశిస్తాయి. <br\>
సూపర్నోవా అవశేషాల వల్ల, తక్కువ జీవిత కాలం కలిగిన రేడియోధార్మిక ఐసోటోపుల వల్ల సౌరమండలంలోని పదార్థ మిశ్రమాన్ని 4.5మిలియన్ సంవత్సరాల క్రితం దగ్గరలో ఉండే సూపర్నోవా నిర్దేశించిదని తెలుస్తుంది. సూపర్నోవాల వల్ల ఏర్పడ్డ భారమూలకాలు కాలక్రమంలో భూమిపై జీవజాలానికి కారణం అయ్యాయి.
 
===భూమిపై ప్రభావం===
సూపర్నోవా రకం, శక్తిలపై ఆధారపడి భూమిపై ఉండే జీవజాలంపై ప్రభావం చూపడానికి 3000 కాంతి సంవత్సరాల దూరం సరిపోతుంది. సూపర్నోవాల నుండి వచ్చే గామా కిరణాలు వాతావరణంపై పొరలలోని నైట్రోజన్ను నైట్రోజన్ ఆక్సైడ్లుగా మార్చి ఓజోన్ పొరను క్షీణింపజేసి, భూమి పైకి హానికారక సౌర, కాస్మిక్ రేడియేషన్ రావటానికి కారణం అవుతుంది. సముద్రాలలోని 60% జీవజాలం నాషనం అయిన ఓర్డోవిషియన్-సిల్యూరియన్ వినాశనానికి సూపర్నోవాలే కారణం కావచ్చని అంచనా. భూమి లోపలి పొరలలోని లోహ ఐసోటోప్ చిహ్నాల ద్వారా సూపర్నోవాలను గుర్తించవచ్చని 1996లో సిద్ధాంతీకరించారు. తర్వాత పసిఫిక్ మహా సముద్రంలో ఐరన్-60 సమృద్ధిగా ఉందని కనుగొన్నారు. అంటార్కిటిక్ మంచులో 2009లో కనుగొన్న నైట్రేట్ అయాన్ నిల్వలు 1006, 1054 సూపర్నోవాలతో సరిపోతున్నాయి. ఆ సూపర్నోవాల నుండి వెలువడ్డ గామా కిరణాలు నైట్రోజన్ ఆక్సైడ్ల పరిమాణాన్ని పెంచి ఉంటాయి, అవే మంచులో కప్పబడిపోయి ఉంటాయి.<br\>
వర్
 
==References==
"https://te.wikipedia.org/wiki/సూపర్_నోవా" నుండి వెలికితీశారు