సూపర్ నోవా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 158:
===భూమిపై ప్రభావం===
సూపర్నోవా రకం, శక్తిలపై ఆధారపడి భూమిపై ఉండే జీవజాలంపై ప్రభావం చూపడానికి 3000 కాంతి సంవత్సరాల దూరం సరిపోతుంది. సూపర్నోవాల నుండి వచ్చే గామా కిరణాలు వాతావరణంపై పొరలలోని నైట్రోజన్ను నైట్రోజన్ ఆక్సైడ్లుగా మార్చి ఓజోన్ పొరను క్షీణింపజేసి, భూమి పైకి హానికారక సౌర, కాస్మిక్ రేడియేషన్ రావటానికి కారణం అవుతుంది. సముద్రాలలోని 60% జీవజాలం నాషనం అయిన ఓర్డోవిషియన్-సిల్యూరియన్ వినాశనానికి సూపర్నోవాలే కారణం కావచ్చని అంచనా. భూమి లోపలి పొరలలోని లోహ ఐసోటోప్ చిహ్నాల ద్వారా సూపర్నోవాలను గుర్తించవచ్చని 1996లో సిద్ధాంతీకరించారు. తర్వాత పసిఫిక్ మహా సముద్రంలో ఐరన్-60 సమృద్ధిగా ఉందని కనుగొన్నారు. అంటార్కిటిక్ మంచులో 2009లో కనుగొన్న నైట్రేట్ అయాన్ నిల్వలు 1006, 1054 సూపర్నోవాలతో సరిపోతున్నాయి. ఆ సూపర్నోవాల నుండి వెలువడ్డ గామా కిరణాలు నైట్రోజన్ ఆక్సైడ్ల పరిమాణాన్ని పెంచి ఉంటాయి, అవే మంచులో కప్పబడిపోయి ఉంటాయి.<br\>
వర్గం-1a సూపర్నోవాలు భూమిపై జీవజాలనికి అత్యంత ప్రమాదకరమని భావిస్తున్నారు. అవి సాధారణ, కాంతిహీన మరుగుజ్జు తారల నుండి ఏర్పడటం వల్ల సరిగ్గా గమనించని నక్షత్రాలలో అకస్మాత్తుగా జరగవచ్చు. భూమిపై ప్రభావం చూపించడానికి ఈ సూపర్నోవాలకు వెయ్యి పార్సెక్ల (3300 కాంతి సంవత్సరాల దూరం) దూరం సరిపోతుంది. దగ్గరలో అలాంటి అవకాశం ఉన్న తార IK పెగాసి. ఈ మధ్య కాలంలో అధ్యయనాల ప్రకారం ఓజోన్ పొరని సగం నాశనం చెయ్యడానికి కనీసం 8(26 కాంతి సంవత్సరాలు) పార్సెక్ల దూరం
వర్
ఉండాలి.
 
==References==
"https://te.wikipedia.org/wiki/సూపర్_నోవా" నుండి వెలికితీశారు