శివసాగర్ (కవి): కూర్పుల మధ్య తేడాలు

చి Bot: replacing dead link thehindu.com with hindu.com
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శివ సాగర్''' ('''కె.జి. సత్యమూర్తి''') మాజీ [[నక్సలైటు]] నాయకుడు, ప్రముఖ [[విప్లవ రచయిత]]. ఇతను 1968 నుంచి విప్లవ కవితలు వ్రాస్తున్నారు. ఇతను అమెరికా సామ్రాజ్యవాదాన్ని దూషిస్తూ కూడా కవితలు వ్రాసారు కానీ కమ్యూనిజాన్ని వ్యతిరేకించే [[ఒసామా బిన్ లాదెన్]] మరియు [[సద్దాం హుస్సేన్]] లాంటి వారిని పొగుడుతూ ఇతను కవితలు వ్రాయడం తోటి విప్లవవాదుల్ని ఆశ్చర్య పరిచింది. శివసాగర్‌ స్వగ్రామం కృష్ణా జిల్లా నందివాడ మండలం [[పోలుకొండ]] పంచాయతీ శివారు [[శంకరపాడు]] . ఆయనకు భార్య మణెమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. చిన్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
 
==విప్లవ జీవితం==
ఇతను 1968లో నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. ఆ సమయం నుంచే ఇతను శివ సాగర్ అనే కలం పేరుతో కవితలు వ్రాయడం మొదలు పెట్టాడు. ఉద్యమంలో పనిచేస్తున్న సమయంలో అతను ఒక కుట్ర కేసులో అరెస్ట్ అయ్యి జైలు శిక్ష కూడా అనుభవించాడు. జైలు నుంచి విడుదల అయిన తరువాత సి.పి.ఐ. (ఎం. ఎల్) పీపుల్స్ వార్ గ్రూప్ లో చేరాడు. ఇతను పీపుల్స్ వార్ గ్రూప్ లో పని చేస్తున్న సమయంలో పార్టీ నాయకులకి, ఇతనికి మధ్య విభేదాలు వచ్చి ఇతన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీలోని అగ్రకులాల నాయకులు దళితుడైన సత్యమూర్తి పార్టీలో ఎదగనివ్వలేదన్న అభిప్రాయం దళితవర్గాలలో ఉన్నది.<ref>http://www.dalitvoice.org/Templates/may_a2006/editorial.htm</ref><ref>http://www.hindu.com/2008/10/20/stories/2008102054790600.htm</ref> ఉద్యమం నుంచి బయటకి వచ్చిన తరువాత కూడా ఇతను కవితలు వ్రాయడం కొనసాగించారు. ఇతను మార్క్సిస్ట్ గతితార్కిక భౌతికవాదాన్ని బలంగా నమ్ముతూ కృశ్చేవ్, బ్రెజ్ఞేవ్, డెంగ్ సియావోపింగ్ లాంటి రివిజనిస్ట్ నాయకుల్ని తీవ్రంగా విమర్శించే కవితలు కూడా వ్రాశాడు. పీపుల్స్ వార్ గ్రూప్ నుండి వెలివేయబడిన సత్యమూర్తి సి.పి.ఐ. (ఎం. ఎల్) ప్రజా ప్రతిఘటన (పి.పి.జి) లో చేరి ఆ బృందం యొక్క లక్ష్యాన్ని వర్గ పోరాటం నుండి కుల పోరాటం వైపు మరలించాడు. దీనితో ప్రజాప్రతిఘటన బృందంలో చాలామంది ఉద్యమకారులు విప్లవ కార్యక్రమాలకు స్వస్తి చెప్పి ప్రధానస్రవంతిలో కలిసిపోయారు.<ref>http://www.hindu.com/thehindu/2000/11/21/stories/0421403e.htm</ref>
Line 6 ⟶ 5:
==వివాహ జీవితం==
ఇతను తన మొదటి భార్యని వదిలిపెట్టి విప్లవ ఉద్యమంలో చేరాడు. విప్లవోద్యమంలో పని చేస్తున్న రోజుల్లో పరిచయమైన తన సహ విప్లవకారిణిని పెళ్ళి చేసుకున్నాడు. అతని రెండవ భార్యకి కూడా అంతకు ముందు పెళ్ళి అయ్యింది. ఆమె మొదటి భర్తతో కలిసి ఉండే రోజుల్లో ఆమెని అత్త మామలు వేధించే వాళ్ళు. ఆమె మొదటి భర్త చేతకాని వాడు కావడం వల్ల అతను తన తల్లి తండ్రులకి ఎదురు చెప్పలేదు. పురుషాధిక్య సమాజంలో జరిగే గృహ హింసతో ఆమె విరక్తి చెంది అందులోంచి బయట పడడానికి ఆమె విప్లవోద్యమంలో చేరింది. ఆ సమయంలోనే ఈమెకు శివ సాగర్ పరిచయమై ఈమెను పెళ్ళి చేసుకున్నాడు.
==విశేషాలు==
 
* కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం [[కందులపాడు]] లోని తన పెద్ద కుమారుడు సిద్దార్థ ఇంట్లో16.4.2012 న శివసాగర్‌ మంగళవారం తుదిశ్వాస విడిచారు.
*సత్యమూర్తి కంకిపాడు మండలం పునాదిపాడులో, ఆ తర్వాత వరంగల్‌ జిల్లా ఖాజీపేటలోని సెయింట్‌ గాబ్రియేల్‌ పాఠశాలలో , ఫాతిమా పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా చేరారు. అక్కడే కొండపల్లి సీతారామయ్య హిందీ ఉపాధ్యాయులుగా ఉన్నారు.
*గుంటూరు కేంద్రంగా రాష్ట్ర యువజన సమాఖ్యను ఏర్పాటు చేయడంతోపాటు 'యువజన' అనే పత్రికకు సంపాదకునిగా ఉన్నారు.
*కులాధిపత్యం నిర్మూలనకు విప్లవపార్టీలు పోరాడాలని పార్టీలో ఎజెండా చర్చకు పెట్టారు. అనంతర కాలంలో ఆయనను పీపుల్స్‌వార్‌ బహిష్కరించింది.
*పీపుల్స్‌వార్‌ రెడ్లు, బ్రాహ్మణుల ఆధిపత్యంలో ఉందని విమర్శించారు.
*గుంటూరుజిల్లా మంగళగిరిలో ఉన్న చార్వాక ఆశ్రమం, దళిత మహాసభ వ్యవస్థాపకులు కత్తి పద్మారావు స్థాపించిన లుంబినీ వనంలో ఉంటూ కొంతకాలం అంబేద్కర్‌ను అధ్యయనం చేశారు.
*దళిత ఉద్యమాన్ని ఏకీకృతం చేయాలనే లక్ష్యంతో 'సామాజిక విప్లవ సమాఖ్య'ను ఏర్పాటు చేశారు. 'ఎదురీత', 'నలుపు' పేరుతో వచ్చిన పత్రికల్లో ఆయనకు భాగస్వామ్యం ఉంది.
* చుండూరు ఊచకోత తర్వాత దళిత ఉద్యమ శ్రేణులతో కలిసి గ్రామంలోనే ఉండి ఉద్యమానికి ప్రేరణ ఇచ్చారు.
*ఆయన 'ఉద్యమ నెలబాలుడు'పై అనేక విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేసిన వారు పీహెచ్‌డీ పట్టాలు పొందారు.
==కొన్ని గేయాలు==
ఉద్యమ నెలబాలుడు', 'నర్రెంక చెట్టు కింద నరుడో భాస్కరుడా!', 'చెల్లీ చంద్రమ్మ', 'తూర్పు పవనం వీచెను'
==మూలాలు==
*ఈనాడు 16.4.2012
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:మార్క్సిస్టులు]]
[[వర్గం:విప్లవ రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/శివసాగర్_(కవి)" నుండి వెలికితీశారు