న్యూట్రాన్ తార: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
==అంతర్గత నిర్మాణం==
[[Image:Neutron star cross section.svg|thumb|500px|right|న్యూట్రాన్ తార నిలువు కోత. సాంద్రతలు సంతృప్త పరమాణు సాంద్రతలలో ''ρ<sub>0</sub>'' (పరమాణు కణాలు ఒకదాన్నొకటి తాకే సాంద్రత) సూచించబడ్డాయి.]]
ప్రస్తుత న్యూట్రాన్ తార నిర్మాణం గణిత నమూనాల ఆధారంగా వివరించబడింది, వీటిని న్యూట్రాన్ తార భ్రమణాలను గమనించడం ద్వారా కూడా వివరించవచ్చు. సాధారణ నక్షత్రాల లాగానే, న్యూట్రాన్ తారల అంతర్గత నిర్మాణం, వాటి భ్రమణాల పౌనఃపున్య వర్ణపటం ఆధారంగా వివరించవచ్చు.<br\>
ప్రస్తుత నమూనాల ఆధారంగా న్యూట్రాన్ తారల ఉపరితలం దృఢమైన పరమాణు కేంద్రకాల అల్లిక, వాటి మధ్య నుండి ప్రవహించే ఎలక్ట్రాన్లను కలిగి ఉంటుంది. ఉపరితలంపై ఉండే కేంద్రకాలు, అధిక బంధన శక్తి ఉండే ఇనుముకి చెందినవి కావచ్చు. లేదా బరువైన ఇనుము వంటి మూలకాలు ఉపరితలంపై నుండి మునిగిపోయి తేలికైన హైడ్రోజన్, హీలియం వంటి కేంద్రకాలు మాత్రమే ఉండవచ్చు. ఒకవేళ ఉపరితల ఉష్ణోగ్రత 10<sup>6</sup> కెల్విన్ కంటే ఎక్కువైతే (కొత్త పల్సార్లలో గమనించినట్టు), అప్పుడు ఉపరితలం, చల్లని న్యూట్రాన్ తారలలో(ఉష్ణోగ్రత <10<sup>6</sup>) గమనించినట్టు ఘన రూపంలో కాక, ద్రవరూపంలో ఉంటుంది .
<br\>న్యూట్రాన్ తారలలో వాతావరణం కొన్ని మైక్రోమీటర్ల మందం ఉండవచ్చు, అది పూర్తిగా నక్షత్రం యొక్క అయస్కాంత క్షేత్రం చేత నియంత్రించబడుతుంది. నక్షత్ర వాతావరణం కింద ఘన స్థితిలోని నక్షత్ర పటలం ఉంటుంది. ఇది చాలా ధృఢమైనది, చాలా నున్ననిది(ఉపరితల గరిష్ఠ్ మిట్టపల్లాలు ~5మి.మీ.).
<br\>దీని లోపల పొరలలో, న్యూట్రాన్లు ఎక్కువగా ఉండే పరమాణు కేంద్రకాలు ఉంటాయి, అటువంటి కేంద్రకాలు భూమిపై తొందరగా రేడియోధార్మిక క్షయం చెందుతాయి, కానీ న్యూట్రాన్ తారలలోని అత్యధిక పీడనాల వల్ల అవి స్థిరంగానే ఉంటాయి.
<br\>దీని లోపల పొరలలో, న్యూట్రాన్లు వాటి కేంద్రకాల నుండి విడిపోయి స్వేచ్ఛా న్యూట్రాన్లుగా మారతాయి. ఇక్కడ పరమాణు కేంద్రకాలు, స్వేచ్ఛా న్యూట్రాన్లు, స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉంటాయి. పరమాణు కేంద్రకాలు క్రమేపీ చిన్నగా మారుతుంటాయి, నక్షత్రకేంద్రంలో అసలే ఉండవు.
 
==ఆవిష్కరణ చరిత్ర==
[[Image:IsolatedNeutronStar.jpg|thumb|right|200px|సాధారణ కాంతిలో నేరుగా గమనించబడ్డ మొదటి న్యూట్రాన్ తార [[RX J185635-3754]].]]
"https://te.wikipedia.org/wiki/న్యూట్రాన్_తార" నుండి వెలికితీశారు