"కె. చక్రవర్తి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (r2.7.2+) (యంత్రము మార్పులు చేస్తున్నది: en:K. Chakravarthy)
''ఫలోమా'' అనే మలయాళ చిత్రం హిందీ దబ్బింగుకి వచ్చింది, దానికి అప్పారావుని సంగీత దర్శకునిగా తీసుకున్నారు. టైటిల్స్‌లో అన్నీ హిందీ పేర్లే ఉన్నాయి, వాటి మధ్య అప్పారావు అనే తెలుగు పేరు ఎందుకని సినిమావారు ఆయనకు చెప్పి చక్రవర్తిగా వేశారు. [[మూగ ప్రేమ]] (1970) చిత్రంకి ఆయన సంగీత దర్శ్కత్వం వహించారు, అందులోనూ చక్రవర్తి పేరు ఖాయమైంది. ఈ విధంగా అప్పారావు చక్రవర్తిగా మారాడు. మూగ ప్రేమలో పాటలు బాగున్నాయి అని పేరు వచ్చిన తరువాత, [[భలే గూఢచారి]] (1970), [[తల్లీ కూతురు]] (1971)లకు సంగీత దర్శకత్వం వహించారు. మూగ ప్రేమలో ''ఈ సంజెలో...'', ''నాగులేటి వాగులోన...'' పాటలు పేరు తెచ్చినట్లు, తల్లీ కూతురు పాటలు కూడా పేరు తెచ్చాయి. అయినా అతను అంతగా పేరు తెచ్చుకోలేదు. కొంత కాలం ప్రయత్నాలు అటూ-ఇటూ సాగాయి. వీటి మధ్య దర్శకుడు [[సి.ఎస్.రావు]] దగ్గర సహాయ దర్శకుడిగా చేరి [[నిలువు దోపిడి]], [[మళ్ళీ పెళ్ళి (1970 సినిమా)|మళ్ళీపెళ్ళి]], [[కంచుకోట]], [[పెత్తందార్లు]] సినిమాలకు పనిచేశాడు. మధ్య మధ్యలో తనకి ఇష్టమై శాఖ సంగీతాన్ని విడిచి పెట కుండా పాటలూ పాడేవాడు. [[శారద (1973 సినిమా)|శారద]] చిత్రంతో సినీ రంగంలో స్థిరపడ్డారు. [[అక్కినేని నాగేశ్వరరావు]]తో ప్రేమాభిషేకం, [[నందమూరి తారకరామారావు|ఎన్.టి.రామారావు‌]]తో కొండవీటి సింహం వంటి విజయవంతమైన చిత్రాలకు సంగీత దర్శకులుగా వ్యవహరించి 850 తెలుగు చిత్రాలకు సంగీతాన్ని అందిచారు. చక్రవర్తి కొన్ని చిత్రాలలో కూడా నటించారు.చివరిసారిగా [[నిన్నే ప్రేమిస్తా]] చిత్రంలో [[సౌందర్య]] నాన్నగారిగా నటించారు.
 
== సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు==
# మూగ ప్రేమ (1971)
# తల్లీ కూతుళ్లు (1971)
==మరణం==
[[అమ్మోరు]] చిత్రానికి చివరి సారిగా సంగీతాన్ని అందించిన చక్రవర్తి [[2002]] [[ఫిబ్రవరి 3]]న కన్నుమూశారు. ఆయన శిష్యుడు [[ఏ.ఆర్.రెహమాన్]] ఆస్కార్ అవార్డు పొందాడు. చక్రవర్తి రెండవ కుమారుడు అయిన [[శ్రీ (సంగీత దర్శకులు)|శ్రీ]] సినీ సంగీత రంగంలో పనిచేస్తున్నాడు.
227

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/714206" నుండి వెలికితీశారు