భద్రాచలం: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ అమరిక
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మండలము - జిల్లా లింకుతో|name=భద్రాచలం|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|mapname=[[Image:Khammam mandals outline08.png|230px]]|state=ఆంధ్ర ప్రదేశ్|head quarter=భద్రాచలం|villages=62|area=|population=77.96|pop_male=39.33|pop_female=38.63|pop-density=|pop-growth=|literacy=57.7|lit_male=63.48|lit_female=51.81}}
[[ఆంధ్ర ప్రదేశ్]], [[ఖమ్మం జిల్లా]] లో, [[గోదావరి]] నది దక్షిణ తీరమున [[భద్రాచలం]] (Bhadrachalam) పట్టణం ఉంది. భద్రాచలం మండలానికి ఈ పట్టణం కేంద్రము. జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన [[పాల్వంచ]] 27 కి.మీ., [[కొత్తగూడెం]] 35 కి.మీ. దూరంలోను ఉన్నాయి.
 
==రామాలయ ప్రశస్తి==
పంక్తి 6:
[[గోల్కొండ]] నవాబు [[అబుల్ హసన్ తానీషా]] పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహసీల్దారుగా [[కంచెర్ల గోపన్న]] ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, ఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు - చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి - చేయించాడు.
 
ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలో బంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని రాముణ్ణి ప్రార్ధించాడు, గోపన్న. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే [[రామదాసు కీర్తనలు]] గా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని ఐతిహ్యం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు [[రామదాసు]] అనేపేరు వచ్చింది.
 
 
[[బొమ్మ:Srirama-Bhadra.jpg|right|250px|thumb|భద్రాచల దేవస్థానంలో శ్రీ సీతారామ లక్ష్మణుల మూల విగ్రహాలు]]
 
దేవాలయం [[భద్రగిరి]] అనే గుట్టపై ఉంటుంది. సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేషప్రజానీకం వస్తారు. రాష్ట్రప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టువస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.
 
==మండలంలోని పట్టణాలు==
పంక్తి 22:
మండలకేంద్రమైన భద్రాచలం ప్రముఖ యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా ఉంది. [[హైదరాబాదు]] నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, [[విజయవాడ]] నుండి [[కొత్తగూడెం]] మీదుగా, [[రాజమండ్రి]] నుండి [[మోతుగూడెం]] మీదుగా, [[విశాఖపట్నం]] నుండి [[సీలేరు]], [[చింతపల్లి]] మీదుగా, [[వరంగల్లు]] నుండి [[ఏటూరు నాగారం]] మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.
 
భద్రాచలానికి రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని కొత్తగూడెంలో[[కొత్తగూడెం]] లో ఉన్న ''భద్రాచలం రోడ్'' స్టేషను అతిదగ్గరలోని స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి ఒకటి, విజయవాడ నుండి ఒకటి, [[రామగుండం]] నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి.
 
[[గోదావరి]] నది పక్కనే భద్రాచలం ఉండడంతో [[రాజమండ్రి]] నుండి ప్రతిరోజూ లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలోనే [[పాపికొండలు]] కానవస్తాయి. భద్రాచలం కేంద్రంగా జరిగే విహారయాత్రల్లో ఈ జలమార్గం ప్రముఖమైనది.
 
==కొన్ని వివరాలు==
"https://te.wikipedia.org/wiki/భద్రాచలం" నుండి వెలికితీశారు