శ్రీకాళహస్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
==శ్రీకాళహస్తి క్షేత్రము==
===క్షేత్ర పురాణము===
[[సువర్ణముఖీ]] నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయం భూలింగము, లింగమునకెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ ' అని అంటారు.
 
అమ్మవారు జ్ఙానప్రసూనాంబ , అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము కలిగించిన పుణ్యక్షేత్రము ఇది.
పంక్తి 13:
ఈదేవాలయము చాలా పెద్దది, పై కప్పుపై రంగులతో చిత్రించిన అనేకములయిన చిత్రములు వున్నాయి.
 
" మణికుండేశ్వరాఖ్య " అనే మందిరమువున్నది. కాశీక్షేత్రములో[[కాశీ]] క్షేత్రములో వలె ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారకమంత్రమునుపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకము.
 
దేవాలయ ప్రాంతములోనే పాతాళ విఘ్నేశ్వరాలయము కలదు. దేవాలయమునకు సమీపములోగల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయము రాజగోపురము యొక్క సింహద్వారము దక్షిణాభిముఖము. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు. [[శ్రీ ఆదిశంకారచార్యులు]] వారు ఇక్కడ [[శ్రీ చక్రము]] స్థాపించారు. ఈ క్షేత్రమునకు గల ఇతర నామములు దక్షిణకైలాసమనియు , సత్య మహా భాస్కరక్షేత్రమనియు , సద్యోముక్తిక్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది.
 
మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది.
"https://te.wikipedia.org/wiki/శ్రీకాళహస్తి" నుండి వెలికితీశారు