పత్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 106:
ప్రత్తిని ఉపయోగించిన తరువాత మిగిలే [[ప్రత్తి గింజ]]లని [[పత్తిగింజల నూనె]] తీయడానికి వాడతారు. శుద్ధి చేసిన తరువాత ఆ నూనెని మనుషులు మామూలు ఇతర నూనెలలాగా వాడుకోవచ్చు. మిగిలిన పిప్పిని పశువులకి దాణాగా ఉపయోగించవచ్చు. కాని అందులో ఉండే [[గాసిపోల్]] అనే విష పదార్థం కొన్ని పశువులకు హానికారి. ప్రత్తి గింజల పొట్టు పశువుల దాణాలో కలుపుతారు. అమెరికాలో బానిసత్వం అమలులో ఉన్నప్పుడు ప్రత్తి వేళ్ళ మీద ఉండే పొట్టు గర్భస్రావాలకై వాడేవారు.
 
ప్రత్తిని గింజలనుండి వేరుచేసిన తరువాత ఆ గిజలకిగింజలకి మెత్తని నూగు ఉంటుంది. ఇంచుమించు 3మి.మి. పొడవు ఉంటుంది. ఆ నూగుని, కాగితం తయారుచేయడానికి,సెల్లులోజ్ ని చేయడానికి వాడతారు.ఈ నూగుని ప్రత్తి ఉన్ని అంటారు. ఈ నూగుని శుద్ధి చేసి వైద్య రంగంలో, సౌందర్య సాధనాలలో, ఇంకా ఇతరత్రా వాడతారు. ఈ ప్రత్తి ఉన్నిని, మొదట వైద్య రంగంలో వాడింది, '''డా.జోసఫ్ శాంసన్ గామీ'''. ఆయన ఇంగ్లాండు, బర్మింగ్ హామ్ లోని క్వీన్స్ ఆసుపత్రిలో మొదట వాడారు.
ఈ నూగుని కొన్ని ప్రక్రియల అనంతరం చొక్కాలకి, సూటులకి వాడే శాటిన్ గుడ్డ లాంటి గుడ్డని తయారు చెయ్యడంలో వాడతారు. ఇది నీరు త్వరగా పీల్చుకోనందున తుండుగుడ్డలకి, అంట్లు తుడిచే గుడ్డలకి వాడలేరు. '''ఈజిప్షియన్ నూలు''' అంటే పేరుకి తగ్గట్టు, ఈజిప్టులో పండే ప్రత్తి. ఇది బాగా పొడుగు పింజ. అందుకని దీన్ని బాగా ఖరీదైన దుస్తులు నేయటానికి వాడతారు. అమెరికా అంతర్యుద్ధ సమయంలో అమోఘమైన పెట్టుబడులు ఈ రకంపైనే పెట్టారు. బ్రిటీషు మిల్లులకి ఈ ప్రత్తే ప్రత్యామ్నాయమైంది. అమెరికా పిమా ప్రత్తి కన్నా ఈ రకం మృదువుగానూ, మన్నిక ఎక్కువగానూ ఉండేది. అందుకే దీని ఖరీదు ఎక్కువ. '''పిమా ప్రత్తి''' అంటే అమెరికా ఆగ్నేయ రాష్ట్రాలలో పండించే ప్రత్తి.
 
"https://te.wikipedia.org/wiki/పత్తి" నుండి వెలికితీశారు