సురభి నాటక సమాజం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: replacing dead link thehindu.com with hindu.com
చి Robot: Automated text replacement (-కడప జిల్లా +వైఎస్ఆర్ జిల్లా)
పంక్తి 1:
ప్రపంచ ప్రఖ్యాత '''సురభి నాటక సమాజం''' [[1885]] లో [[కడప]] జిల్లా [[సురభి]] గ్రామంలో 'కీచక వధ'నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు [[వనారస గోవిందరావు]].
 
[[1885]] లో వనారస సోదరులు వనారస గోవింద రావు మరియు వనారస చిన్నరామయ్య కలిసి కడపవైఎస్ఆర్ జిల్లా [[చక్రాయపేట]] మండలములోని సురభి రెడ్డివారిపల్లెలో శ్రీ శారదా వినోదిని నాటక సభను ప్రారంభించారు. సురభిలో ప్రారంభమైన ఈ నాటక సభ కాలక్రమేణ సురభి నాటక సంఘముగా ప్రసిద్ధి చెందినది. రంగస్థలముపై స్త్రీ పాత్రలను స్త్రీలచే ధరింపచేసిన తొలి నాటక బృందము సురభినే. నాటకములోని పాత్రధారులందరూ ఒకే కుటుంబములోని సభ్యులవడము చేత స్త్రీలకు చెడ్డపేరు వస్తుందనే భయము ఉండేది కాదు. బృందములోని సభ్యులకు రంగస్థలమే జీవితముగా సాగేది.
[[బొమ్మ:Surabhi-maya-bazaar-scene1.jpg| thumb| right| మాయా బజార్ నాటకంలో శశిరేఖగా మారిన ఘటోత్కచుడు, చెలికత్తెలను మగవాని కదలికలతో భయపెట్టుట]]
స్థాపించిన కొద్దిరోజులలోనే ఈ సమాజము త్వరితగతిన విస్తరించి 50 వేర్వేరు బృందములుగా వృద్ధిచెందినది. ప్రతి బృందము దాదాపు 30 మందికి పైగా సభ్యులతో స్వయము సమృద్ధిగా ఉండేవి. వనారస గోవింద రావుకు ముగ్గురు కుమారులు పదిమంది కుమార్తెలు. వీరి కుటుంబము వ్యాపించిన కొలది బృందములు కూడా వ్యాపించినవి. [[సినిమా]] మరియు [[టీవీ]]ల ఆగమనముతో [[1974]] కల్లా బృందముల సంఖ్య 16కు క్షీణించినది. [[1982]] నాటికి కేవలము నాలుగు సురభి నాటక బృందాలు మాత్రమే మనుగడలో ఉన్నవి. ప్రస్తుతము ఆంధ్ర దేశములో సురభి నాటక కళాసంఘము ఆధ్వర్యములో ఐదు నాటక బృందములు పనిచేస్తున్నవి.[[బొమ్మ:SreeVenkateswaraNatyaMandali.jpg| thumb|right| శ్రీ ఆర్ నాగేశ్వరరావు సారధ్యంలో శ్రీ వెంకటేశ్వర నాట్యమండలి వారి మాయాబజార్ నటులు]]
"https://te.wikipedia.org/wiki/సురభి_నాటక_సమాజం" నుండి వెలికితీశారు