పండూరివారి మామిడి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పండూరివారి మామిడి చాలా పురాతనమైన మామిడి రకం. పూర్వం [[ఆంధ్ర క్షత్రియులు]](రాజులు)తమ రాజ కోట బృందావనాల్లో ఈ రకం చెట్లు పెంచేవారు. ఈ రకం మామిడి చూడడానికి కూరల్లో, పప్పుల్లో వేసుకొనే మామిడి కాయ వలే చిన్నగా ఉంటుంది. రుచికి అన్ని మామిడి కాయలకంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ కాలంలో రాజులు ఈ కాయల రుచిని ఆస్వాదించేవారు, తమ రాయల్టీ నిలబెట్టుకోవడం కోసం బంధువులకు, స్నేహితులకు, మిత్ర సామ్రాజ్యపు రాజులకు పంచిబెట్టేవారు. పండూరివారి మామిడి ఇతర మామిడి రకాలవలే మగ్గే సమయంలో రంగు రాదు. గోదావరి జిల్లాల్లో నేటికీ రాజులు తమ రాయల్టీ నిలబెట్టుకోవడానికి ఇతరులకు పంచిబెట్టుకుంటారు. ఇప్పటికీ పశ్చిమగోదావరి[[పశ్చిమ జిల్లాలోగోదావరి జిల్లా]] లో [[తణుకు]] వంటి ప్రదేశాల్లో చాలా పురాతనమైన పండూరివారి మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి కాయల సీజన్ పండూరివారి మామిడితోనే మొదలవుతుంది.
"https://te.wikipedia.org/wiki/పండూరివారి_మామిడి" నుండి వెలికితీశారు