మంచి మనసులు (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
బాబూ మూవిస్ పతాకం మీద సి. సుందరం నిర్మించిన విజయవంతమైన చిత్రం మంచిమనసులు. మానవత విలువలతో తనను పెద్ద చేసి చదివించిన అన్న కుమార్తె కోసం తన ప్రేమను త్యాగం చేసిన యువకుడి కథ. ఐతే, అన్న కుమార్తె ప్రేమించింది ఒక స్వార్ధ పరుడిని. వీరి మధ్య నడుస్తుంది ఈ కథ.
== చితకథ ==
కథానాయకుడు వేణు(నాగేశ్వరారావు) విద్యార్ధి. అన్న గారు (గుమ్మడి) కమ్మరి. అతడు కష్టపడుతూ, తమ్ముడిని పట్టణం లో బి.ఏ. చవివిస్తూ ఉంటాడు. హాస్టల్ లో ఉంటే ఖర్చు బాగా అవుతుందని అన్న గారి భారం తగ్గించాలని పబ్లిక్ ప్రాసిక్యుటర్ ఆనందరావు (ఎస్.వి.రంగారావు) ఇంట్లో ఒక గదిని తీసుకొని ఉంటాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనందరావు భార్య కాంతానికి (సూర్యకాంతం) నోటిదురుసు కాని మంచి మనిషి. వారి కూతురు శాంతి (సావిత్రి) లా చదువుతూ ఉంటుంది. పెళ్లీడు వచ్చిన కూతురు ఉందని పెళ్లి కాని వారికి ఇల్లు అద్దెకివ్వనంటుంది. ఆనందరావు మంచి విద్యార్ధికి సాయం చేయాలనే ఉద్దేశంతో పెళ్లి అయిందని అబధ్దం ఆడ మంటాడు. శాంతి అతడికి పెళ్లికాలేదని తెలిసి ఆట పట్టిస్తుంది. వేణు,శాంతి ఒకిరినొకరు ప్రేమించు కుటారు. వేణు మంచి నడవడి కాంతాన్ని కూడా కట్టి పడేస్తుంది. వేణు అన్న మరణిస్తాడు. వేణు అన్న గారి కుమార్తె (వాసంతి ) కుమార్ (నాగభూషణం) అనే యువకుడిని ప్రేమిస్తుంది. అతడు స్వార్ధ పరుడు. అతని తల్లి దండ్రులు వేణు తమ గుడ్డి కుమార్తె (షావుకారు జానకి) ని వేణు వివాహమాడాలని నిబంధన ఉంచుతారు కుమార్ తల్లి దండ్రులు. వేణుసమయానికేనిబంధనకు తల ఒగ్గుతాడు. అతని నిర్ణయాన్ని ఆనందరావు, శాంతి సమర్ధిస్తారు కాని కాంతమ్మ అది అవమానం గా భావిస్తుంది. శాంతిని మర్చిపోలేక వేణు భార్యకు దగ్గరకు కాలేక పోతాడు. కాని శాంత ప్రోద్బలంతో భార్యాభర్తల మధ్య అనురాగం ఏర్పడుతుంది. కుమార్ కు వివాహానికి ముందే ఒకామెతో పరిచయమవుతుంది. ఆమె కుమార్ కు ధన సహాయం కూడా చేస్తూ ఉంటుంది. కుమార్ వివాహ విషయం తెలిసి అతడిని నిలదీస్తుంది. ఆమెను హంపీ విజయనగరానికి తీసుకు వెళ్తాడు. యాదృచ్చికంగా వేణు, గర్భవతి అయిన భార్యను తీసుకొని హంపీ విజయనగరానికి వస్తాడు. కుమార్ నిలదీస్తున్న ప్రేయసిని హత్య చేసి పారిపోతూ చెల్లెలి కాలి తొక్కి పారిపోతాడు. కుమార్ అఘాయత్యాన్ని చూసిన వేణు అన్న కూతురు పసుపు కుంకుమ నిలబెట్టడానికి హత్యను తనమీద వేసుకుంటాడు. ఈ కేసు ను శాంత డిఫెన్స్ లాయర్ గా వేణు తరఫున వాదిస్తుంది. కుమార్ చెల్లెలు కుమార్ కు వ్యతిరేకం గా సాక్ష్యం చెబుతుంది. కుమార్ హత్యకు వాడిన ఆయుధం రక్తపు దుస్తులు కుమార్ భార్య కంటబడతాయి. ఆ సాక్షాలు తీసుకొని కోర్టుకు వస్తుంది. ఒక మంచి మనిషినికాపాడడానికి ఇందరి ప్రయత్నం చూసి కుమార్ లో మార్పు పచ్చి తన నేరాన్ని ఒప్పుకుంటాడు.
 
==పాటలు==